జగన్ కి న్యాయం చేయాలి.. వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్న నాగబాబు
అమాయకుడైన జగన్ కి న్యాయం చేయాల్సిందిగా తాను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.
గత కొన్నిరోజులుగా జగన్ పై వరుస ట్వీట్లు వేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సందర్భం లేకపోయినా నాగబాబు వేస్తున్న ట్వీట్లపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే నాగబాబు మాత్రం తగ్గేది లేదంటున్నారు. మరోసారి జగన్ పై ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు. కూటమి ప్రభుత్వంలో జగన్ కి న్యాయం చేస్తామన్నారాయన.
2019 కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి.
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 29, 2024
ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన…
పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్ ని వెటకారం చేస్తున్నట్టుగా మాట్లాడారు నాగబాబు. 2019 కి ముందు ఎమ్మెల్యేగా ఉండి, తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిన జగన్ కి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు నాగబాబు. కోడికత్తి దాడిని ఆయన ప్రస్తావించారు. ఐదేళ్లయినా కూడా ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదన్నారు. గతంలో సీఎంగా జగన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కేసు విచారణకు హాజరవడం కుదర్లేదని, ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు.
జగన్ పై హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా..! అని ప్రశ్నించారు నాగబాబు. ఆ కేసులో తక్షణమే విచారణ జరగాలన్నారు. అమాయకుడైన జగన్ కి న్యాయం చేయాల్సిందిగా తాను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.