మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకువెళ్లడానికి వీల్‌ఛైర్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉందన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ దారుణంగా ఉన్నదని మండిపడ్డారు. ఆస్పత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని.. లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Previous Articleఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
Next Article మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరు
Keep Reading
Add A Comment