Telugu Global
Andhra Pradesh

చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలు

చిరుత పాదముద్రలు గుర్తించామని..అక్కడి నర్సరీల్లో సంచరిస్తున్నట్లు జిల్లా డీఎఫ్‌వో వెల్లడి

చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలు
X

తూర్పుగోదావరి జిల్లా కడియంలో కొన్నిరోజులుగా చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. అక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు జిల్లా డీఎఫ్‌వో భరణి తెలిపారు. చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలు ఉపయోగించినట్లు పేర్కొన్నారు. చిరుత నుంచి కాపాడుకోవడానికి నర్సరీ రైతులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. పాదముద్రలు గుర్తించామన్నారు. మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్‌ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్‌, కాల్వ దాటి దివాన్‌ చెరువు నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు. గురువారం ట్రాప్‌ కేజెస్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఏడిద, మర్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా డీఎఫ్‌వో అధికారి తెలిపారు. చిరుత సంచారంపై స్థానికులకు అవగాహన కల్పించామన్నారు. కడియపు లంకలో సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తుననట్లు చెప్పారు.

First Published:  26 Sept 2024 12:34 PM IST
Next Story