పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు వ్యయం చేయనున్నప్రభుత్వం
BY Raju Asari18 Jan 2025 12:26 PM IST

X
Raju Asari Updated On: 18 Jan 2025 12:26 PM IST
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించారు. 1.5 మీటర్ల మందంతో నది ప్రవాహ మార్గంలో భూమి లోపల దీని నిర్మాణం చేపట్టనున్నారు. పాత డయాఫ్రమ్ వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. సగం నిర్మాణం పూర్తికాగానే సమాంతరంగా దానిపైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం కార్యాచరణ షెడ్యూల్ జారీ చేసింది. కొత్త డయాఫ్రం వాల్ కోసం రూ.990 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనున్నది.
Next Story