Telugu Global
Andhra Pradesh

100 రోజుల్లో 1.25లక్షల ఇళ్ల నిర్మాణం.. సాధ్యమేనా..?

నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.

100 రోజుల్లో 1.25లక్షల ఇళ్ల నిర్మాణం.. సాధ్యమేనా..?
X

పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త డెడ్ లైన్ ప్రకటించింది. 100 రోజుల్లో లక్షా పాతిక వేల ఇళ్లను నిర్మిస్తామని చెప్పింది. గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఈమేరకు ప్రకటించారు. వచ్చే ఏడాదిలోగా 8.25 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. డెడ్ లైన్ ఘనంగానే ఉంది కానీ, దాన్ని కూటమి ప్రభుత్వం అందుకోగలదా అనేదే ఇప్పుడు ప్రశ్న.


కేంద్ర బడ్జెట్ లో అమరావతికి అప్పు ఇప్పిస్తామన్నారే కానీ, మిగతా విషయాల్లో ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు లభించలేదు. ఈ దశలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనపైనే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. గత ప్రభుత్వంలో నిర్మాణం మొదలైన, సగం జరిగిన, పూర్తయిన వాటిని పరిగణలోకి తీసుకుంటే కొత్త ప్రభుత్వం తన డెడ్ లైన్ ని ఈజీగా అందుకుంటుంది. కొత్తగా శంకుస్థాపనలు చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలంటే మాత్రం 100 రోజుల్లో లక్షా పాతిక వేల ఇళ్ల నిర్మాణం అసాధ్యమనే చెప్పాలి. నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది. తమ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని తేల్చి చెబుతున్నారు వైసీపీ నేతలు.

ఏపీలో కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే-అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించ లేదని.. ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని విమర్శించారు మంత్రి పార్థసారథి.

First Published:  29 July 2024 2:59 PM GMT
Next Story