కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న పోలింగ్
Advertisement
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్నది. మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12.7 శాతం, మెదక్-ఆదిలాబాద్, నిజామాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7.1 శాతం, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16.78 శాతం పోలింగ్ నమోదైంది.
Advertisement