‘నథింగ్’ ఫోన్ వచ్చేస్తోంది! దీని ప్రత్యేకతలేంటంటే..
మొబైల్ మార్కెట్లో ‘వన్‌ప్లస్’ బ్రాండ్ గురించి తెలియని వారుండరు. ఈ బ్రాండ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ సక్సెస్‌ను అందుకుంది. అయితే ‘వన్‌ప్లస్’ ఫౌండర్స్‌లో ఒకరైన కార్ల్ పీ.. సంస్థ నుంచి బయటకొచ్చి ‘నథింగ్’ పేరుతో కొత్త మొబైల్ బ్రాండ్‌ను ఇంట్రడ్యూస్ చేశాడు. దీంతో ఈ బ్రాండ్‌కు మంచి క్రేజ్ లభిస్తోంది. ‘నథింగ్’ నుంచి వస్తోన్న ‘నథింగ్ ఫోన్ 1’ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జులై 12న లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్1.. ఇతర […]
మొబైల్ మార్కెట్లో ‘వన్‌ప్లస్’ బ్రాండ్ గురించి తెలియని వారుండరు. ఈ బ్రాండ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ సక్సెస్‌ను అందుకుంది. అయితే ‘వన్‌ప్లస్’ ఫౌండర్స్‌లో ఒకరైన కార్ల్ పీ.. సంస్థ నుంచి బయటకొచ్చి ‘నథింగ్’ పేరుతో కొత్త మొబైల్ బ్రాండ్‌ను ఇంట్రడ్యూస్ చేశాడు. దీంతో ఈ బ్రాండ్‌కు మంచి క్రేజ్ లభిస్తోంది.
‘నథింగ్’ నుంచి వస్తోన్న ‘నథింగ్ ఫోన్ 1’ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జులై 12న లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్1.. ఇతర స్మార్ట్‌ఫోన్ల తరహాలో కాకుండా కాస్త విన్నూత్నంగా ఉండబోతోంది. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానల్‌తో ఈ మొబైల్ డిజైన్ యునిక్‌గా కనిపిస్తోంది. అంతేకాదు ఇంటర్నెట్‌లో లీకైన ఈ మొబైల్ ఫీచర్లు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
‘నథింగ్ 1’ బ్యాక్ ప్యానెల్ పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఉండే గ్లిఫ్ ఇంటర్ ఫేస్ అనే ఫీచర్ ద్వారా ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ నుంచి లైట్లు బ్లింక్ అవుతుంటాయి. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా ఈ లైట్లు అలెర్ట్ చేస్తుంటాయి. చార్జింగ్ పెట్టగానే మొబైల్ చుట్టూ సన్నని గీత వెలుగుతుంటుంది. ఇది బ్యాటరీ లెవెల్‌ను తెలుపుతుంది. అంతేకాకుండా ఐఫోన్ 12 తరహాలో నథింగ్ పోన్ 1లో వర్టికల్లీ ప్లేస్డ్ డ్యూయల్ రేర్ కెమెరా సిస్టం ఉండబోతోంది. ఇంకా యూజర్లు ఊహకు అందని ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు ఈ మొబైల్‌లో ఉండనున్నట్టు సంస్థ చెప్తోంది.