దర్శకుడిని మార్చిన స్కై డైవింగ్

ప్రతి మనిషి ఏదో ఒక పాయింట్ దగ్గర మారతాడు. కొందర్ని కొన్ని సంఘటనలు మార్చేస్తాయి, మరికొందర్ని వ్యక్తులు మార్చేస్తారు. చాలామంది తమ స్వీయ అనుభవాలతో మారుతారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ జీవితంలో కూడా అలాంటి ఓ ఘటన, స్వీయ అనుభవం ఉన్నాయి. అదే స్కై డైవింగ్. స్కై డైవింగ్ చేయడానికంటే ముందు తరుణ్ భాస్కర్ జీవితం చాలా క్రమశిక్షణతో ఉండేదట. చాలా విషయాల గురించి ఆలోచించడం, నిద్రలేకుండా గడపడం లాంటివి చేశాడట. ఓసారి విదేశాలకు వెళ్లినప్పుడు స్కై […]

Advertisement
Update:2022-06-04 11:10 IST

ప్రతి మనిషి ఏదో ఒక పాయింట్ దగ్గర మారతాడు. కొందర్ని కొన్ని సంఘటనలు మార్చేస్తాయి, మరికొందర్ని వ్యక్తులు మార్చేస్తారు. చాలామంది తమ స్వీయ అనుభవాలతో మారుతారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ జీవితంలో కూడా అలాంటి ఓ ఘటన, స్వీయ అనుభవం ఉన్నాయి. అదే స్కై డైవింగ్.

స్కై డైవింగ్ చేయడానికంటే ముందు తరుణ్ భాస్కర్ జీవితం చాలా క్రమశిక్షణతో ఉండేదట. చాలా విషయాల గురించి ఆలోచించడం, నిద్రలేకుండా గడపడం లాంటివి చేశాడట. ఓసారి విదేశాలకు వెళ్లినప్పుడు స్కై డైవింగ్ చేశాడు తరుణ్. నిజానికి అతడికి అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండదట.

కానీ స్కై డైవింగ్ చేద్దాం, ఏం అవుతుందో చూద్దాం అనే తెగింపుతో చేశాడంట. అలా చేసిన తర్వాత తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందంటున్నాడు తరుణ్ భాస్కర్.

అంత ఎత్తు నుంచి, ఆకాశం పై నుంచి భూమి మీదకు పడిపోతుంటే.. అప్పటివరకు తను ఫేస్ చేసిన సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయట ఈ దర్శకుడికి. పైగా జీవితంలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే తాత్విక భావన వచ్చిందట. అంతేకాదు.. కింద ఉన్న భూమిని చూసిన తర్వాత భూమిపై బతకడమే అదృష్టం అని భావించాడట.

అప్పట్నుంచి అన్ని ఇగోలు పక్కన పెట్టేశాడట. లైఫ్ ను మరో కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టాడట. తనకు జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా తట్టుకునే శక్తిని స్కై డైవింగ్ ఇచ్చిందని చెబుతున్నాడు ఈ దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News