‘కొండా’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ

డేంజరస్ సినిమా డైలమాలో పడింది. అతడు తీసిన లేడీ మార్షన్ ఆర్ట్స్ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు సినిమాల్ని పక్కనపెట్టి మరో సినిమా పని స్టార్ట్ చేశాడు వర్మ. ఈసారి ‘కొండా’ సినిమాతో తెరపైకొచ్చాడు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ […]

Advertisement
Update:2022-06-04 08:43 IST

డేంజరస్ సినిమా డైలమాలో పడింది. అతడు తీసిన లేడీ మార్షన్ ఆర్ట్స్ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు సినిమాల్ని పక్కనపెట్టి మరో సినిమా పని స్టార్ట్ చేశాడు వర్మ. ఈసారి ‘కొండా’ సినిమాతో తెరపైకొచ్చాడు.

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం రెండో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో సినిమా బేసిక్ పాయింట్ ఏంటనేది చెప్పేశారు.

“నేను విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు తీశా. నాకు తెలంగాణపై అవగాహన లేదు. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది గురించి విన్నాను. అప్పుడు కొండా మురళి పేరు ప్రత్యేకంగా అనిపించింది. నేను రియలిస్టిక్, రస్టిక్ సినిమాలు తీశా. మురళి, సురేఖ క్యారెక్టర్లు నాకు స్పెషల్ గా అనిపించాయి.

అంతకు ముందు అటువంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదు. వాళ్ళ గురించి తెలిశాక… సినిమా తీయాలని రీసెర్చ్ చేశా. కొండా ఫ్యామిలీని కలిశా. సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. నా తల్లిదండ్రుల కథ కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తానని కొండా దంపతుల కుమార్తె సుష్మితా పటేల్ చెప్పారు. నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళ కథ అంటే వాళ్ళ ప్రాపర్టీ కదా! వెంటనే ఓకే చెప్పా”

ఇలా కొండా సినిమా గురించి తనదైన విశ్లేషణ ఇచ్చాడు ఆర్జీవీ. ఈ సినిమాతో మరోసారి అందరికీ పాత వర్మ గుర్తొస్తాడని చెబుతున్న ఆర్జీవీ.. సినిమా రిలీజైన తర్వాత మరిన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని ప్రకటించాడు.

Full View

Tags:    
Advertisement

Similar News