దయచేసి వినండి.. మా సినిమా ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ కాదు..!

కరోనా కాలంలో సినీ ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి ఆస్కారం లేకపోవడంతో అప్పట్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కరోనాకు ముందే ఓటీటీలు పుట్టుకొచ్చినా వాటికి ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. అయితే కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఓటీటీలకు స్వర్ణ యుగం మొదలైంది. కొత్త సినిమాలు వాటిలో నేరుగా విడుదల అవుతుండటంతో ఓటీటీలను సబ్ స్క్రైబ్ […]

Advertisement
Update:2022-06-03 08:10 IST

కరోనా కాలంలో సినీ ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి ఆస్కారం లేకపోవడంతో అప్పట్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.

కరోనాకు ముందే ఓటీటీలు పుట్టుకొచ్చినా వాటికి ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. అయితే కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఓటీటీలకు స్వర్ణ యుగం మొదలైంది.

కొత్త సినిమాలు వాటిలో నేరుగా విడుదల అవుతుండటంతో ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య అమాంతంగా పెరిగింది.

తమ బిజినెస్ కూడా పెరగడంతో ఓటీటీ సంస్థలు కూడా భారీ మొత్తంలో చెల్లించి సినిమాలు కొనడం మొదలుపెట్టాయి. కరోనా ప్రభావం తగ్గిపోయి థియేటర్లు ప్రారంభమైనా ఓటీటీల హవా ఇంకా కొనసాగుతోంది.

ఎందుకంటే థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కిన పుష్ప, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 వంటి సినిమాలు విడుదలైన 50 రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇక ఆచార్య, సర్కారు వారి పాట వంటి సినిమాలు మూడు వారాల్లోగానే ఓటీటీల్లో విడుదల అయ్యాయి.

కొత్త సినిమాలు అలా విడుదల అయ్యాయో లేదో ఇలా ఓటీటీల్లోకి వస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు మొఖం చూపడం లేదు. దానికి తోడు సినిమా టికెట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో సినిమాలు చూసేందుకు ఓటీటీలే బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. కుటుంబ కథా చిత్రం కూడా కావడంతో మంచి వసూళ్లు రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా ఆ సినిమాకు కలెక్షన్లు దక్కలేదు. దీనికి కారణం జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడమే. కొద్ది రోజులు ఆగుదాం..ఆ సినిమా ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కదా.. అనే ధోరణి ప్రేక్షకుల్లో కనిపించింది.

ఈ సినిమాకు తగిలిన దెబ్బతో మూవీ మేకర్స్ మేల్కొన్నారు. తమ కొత్త సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ప్రమోషన్లలో భాగంగా తమ సినిమాకు సరసమైన ధరల్లో టికెట్లు విక్రయిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

ఎఫ్ -3, మేజర్ సినిమాలకు సంబంధించి విడుదలకు ముందే ఇటువంటి ప్రమోషన్లు చేశారు. అలాగే ఎఫ్-3 టీం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారేమో.. కానీ తమ సినిమాను ఇప్పటికిప్పుడే ఓటీటీలో విడుదల చేసే అవకాశం లేదని ప్రకటించారు.

కనీసం ఓటీటీలోకి రావడానికి రెండు నెలల సమయం అయిన పడుతుందని పేర్కొన్నారు. తమ సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాలని విన్నవించారు. ఓటీటీలకు ప్రేక్షకులు ఏ రేంజ్ లో అలవాటు పడ్డారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Similar News