కార్డియాక్ అరెస్ట్‌తోనే కేకే మృతి.. కానీ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో మరిన్ని ఆశ్చర్యపరిచే విషయాలు..

ప్రముఖ సింగర్ కేకే మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఓ ప్రదర్శన సమయంలో అస్వస్థకు గురై.. ఆ తర్వాత హోటల్ రూమ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఆయన మృతదేహానికి ఎస్ఎస్‌కే గవర్నమెంట్ హాస్పిటల్‌లో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం కేకే తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్లు తేల్చారు. అదే సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేకేకి క్రానిక్ లివర్ డిసీజ్‌ ఉన్నదని, దాంతో పాటు ఊపిరితిత్తుల కండిషన్ అసలు ఏమీ బాగాలేదని […]

Advertisement
Update:2022-06-01 13:42 IST

ప్రముఖ సింగర్ కేకే మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఓ ప్రదర్శన సమయంలో అస్వస్థకు గురై.. ఆ తర్వాత హోటల్ రూమ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఆయన మృతదేహానికి ఎస్ఎస్‌కే గవర్నమెంట్ హాస్పిటల్‌లో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం కేకే తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్లు తేల్చారు. అదే సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కేకేకి క్రానిక్ లివర్ డిసీజ్‌ ఉన్నదని, దాంతో పాటు ఊపిరితిత్తుల కండిషన్ అసలు ఏమీ బాగాలేదని రిపోర్టులో స్పష్టం చేశారు. కేకే చివరి ప్రదర్శన సమయంలో కూడా తీవ్రమైన అలసటతో ఉన్నారు. ఆయాసపడుతూ ఉండటం కొన్ని వీడియోల్లో కనిపించింది. ఇతర శరీర అవయవాలు కూడా పాడైపోవడంతోనే గుండె పోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

ప్రభుత్వ వైద్యులు దాదాపు గంటర్నర సేపు కేకే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దాన్ని పూర్తిగా వీడియోలో చిత్రీకరించారు. పోస్టు మార్టం అనంతరం అతని మృతదేహాన్ని రవీంద్ర సదన్‌కు తరలించారు. అక్కడ కేకే భౌతికకాయానికి గన్ సెల్యూట్ లభించింది. వెస్ట్ బెంగాల్ సీఎం సీఎం మమత బెనర్జీతో పాటు కేకే కుటుంబం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు రాత్రికి కేకే మృతదేహాన్ని ముంబైకి తరలిస్తారని.. జూన్ 2న అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబం తెలిపింది.

ALSO READ : ప్రముఖ సినీ గాయకుడు కేకే హటాన్మరణం

Tags:    
Advertisement

Similar News