అంతకుమించి అడగొద్దు ప్లీజ్
రాజ్-కోటి.. ఈ సంగీత ద్వయం ఓ ప్రభంజనం. టాలీవుడ్ లో ఎన్నో మరపురాని హిట్స్ ఇచ్చారు. ప్రతి సినిమాకు ఓ సిగ్నేచర్ ట్యూర్ అందించారు. అలాంటి సంగీత దర్శకులు సడెన్ గా విడిపోయారు. విడివిడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇద్దరికీ హవా తగ్గింది. ఈ విడిపోవడంపై తాజాగా సంగీత దర్శకుడు కోటికి ఓ ప్రశ్న ఎదురైంది? దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఎక్కువగా చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. “మేమిద్దరం కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివేం చేయలేదు. విడిపోవాలనుకున్నాం, […]
రాజ్-కోటి.. ఈ సంగీత ద్వయం ఓ ప్రభంజనం. టాలీవుడ్ లో ఎన్నో మరపురాని హిట్స్ ఇచ్చారు. ప్రతి సినిమాకు ఓ సిగ్నేచర్ ట్యూర్ అందించారు. అలాంటి సంగీత దర్శకులు సడెన్ గా విడిపోయారు. విడివిడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇద్దరికీ హవా తగ్గింది. ఈ విడిపోవడంపై తాజాగా సంగీత దర్శకుడు కోటికి ఓ ప్రశ్న ఎదురైంది? దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఎక్కువగా చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.
“మేమిద్దరం కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివేం చేయలేదు. విడిపోవాలనుకున్నాం, విడిపోయామంతే. ఆ టైమ్ లో అలా జరిగిపోయింది. అంతకుమించి నన్నేం అడగొద్దు. నిజానికి చివరి వరకు కలిసి పనిచేద్దాం అనుకున్నాం. కానీ చేయలేకపోయాం. అయితే ఇప్పటికీ మేం స్నేహంగానే ఉంటాం. విడిపోయిన తర్వాత ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని ఇద్దర్నీ కలిసి పనిచేయమని అడిగారు. కానీ మేం ఒప్పుకోలేదు. విడిపోయిన తర్వాత జగపతిబాబు కోసం ఒకే ఒక్క సినిమా చేశాం. ఆ తర్వాత మళ్లీ కలిసి పనిచేయలేదు.”
ఇలా రాజ్ తో విడిపోవడంపై స్పందించారు కోటి. చక్రవర్తి దగ్గర శిష్యరికం చేసినప్పట్నుంచి రాజ్ తో పరిచయం ఉందని, అలా చక్రవర్తి దగ్గర పదేళ్లు కలిసి పనిచేశామని, ఆ తర్వాత సంగీత దర్శకులుగా చాలా ఏళ్ల పాటు కలిసి పనిచేశామంటూ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
సంగీతం లోకి ఎలక్ట్రానిక్స్ ప్రవేశించిన తర్వాత, కొత్త తరం రావడం మొదలైందని.. ఆ టైమ్ లో తనకు అవకాశాలు తగ్గాయని అన్నారు కోటి. అయితే తనలో ఇప్పటికీ మ్యూజిక్ ఇవ్వాలనే కసి ఉందని, మంచి సినిమా ఆఫర్లు వస్తే కచ్చితంగా ట్యూన్స్ ఇస్తానని చెబుతున్నారు.