చలి కాలంలో ఎన్ని నీళ్ళు తాగాలి?

మామూలుగానే చాలామందికి తరచూ నీళ్లు తాగే అలవాటుండదు. రోజుకి 2 లేదా 3 లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు చెప్తున్నా హైడ్రేషన్‌ను అంతగా పట్టించుకోరు. అలాంటిది ఇది చలికాలం. ఈ కాలంలో అసలు నీళ్లు తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. పైగా దాహం కూడా వేయదు. చలికాలంలో మనకి చెమట పట్టదు. కానీ, చలి గాలులకి బాడీలో నుంచి మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో బాడీని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా […]

Advertisement
Update:2020-12-22 08:23 IST

మామూలుగానే చాలామందికి తరచూ నీళ్లు తాగే అలవాటుండదు. రోజుకి 2 లేదా 3 లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు చెప్తున్నా హైడ్రేషన్‌ను అంతగా పట్టించుకోరు. అలాంటిది ఇది చలికాలం. ఈ కాలంలో అసలు నీళ్లు తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. పైగా దాహం కూడా వేయదు. చలికాలంలో మనకి చెమట పట్టదు. కానీ, చలి గాలులకి బాడీలో నుంచి మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో బాడీని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. దానికోసం కొన్ని ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకుంటే చాలు.

చలికాలంలో కోల్డ్ వెదర్‌‌ని తట్టుకోవడానికి శరీరాన్ని ప్రిపేర్ చేయాలి. దీనికోసం లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేయాలి. చలికాలంలో అంతగా దాహం వేయదు. కాబట్టి నీళ్లు తాగే విషయంలో చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల ఇమ్యూనిటి తగ్గడం, వేడి చేయడం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలొస్తాయి. అందుకే రెగ్యులర్ డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు అందేలా చూసుకోవచ్చు. ఆ ఫుడ్స్ ఏంటంటే..

టొమాటో…

టొమాటోలో కూడా తొంభై శాతం నీరే ఉంటుంది. అందుకే వింటర్‌‌లో చేసుకునే వంటల్లో ఎక్కువగా టొమాటోని కలిపి వండుకుంటే శరీరానికి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ ఉండదు. టొమాటో వల్ల శరీరానికి లోపలి నుంచి పోషణ అందుతుంది. దాంతోపాటు టొమాటోలు బరువు తగ్గడంలో కూడా సాయ పడతాయి. ఇందులో సోడియం, పొటాషియం, విటమిన్ A ఎక్కువగా ఉంటాయి.

పాలకూర…

చలికాలం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పాలకూర బాగా పనికొస్తుంది. పాలకూరలో 90శాతం నీరే ఉంటుంది. అందుకే చలికాలంలో పాలకూర ఎక్కువగా తినడం వల్ల శరీరానికి తగినంత నీరు అందేలా చేస్తుంది. అంతేకాకుండా పాలకూరలో ఐరన్, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ఫోలేట్ ఉంటాయి. దీనివల్ల చలికాలంలో జుట్టు, చర్మ రక్షణకు కూడా ఇది తోడ్పడుతుంది.

క్యాప్సికం…

క్యాప్సికంలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇందులో దాదాపు 94 శాతం నీరే ఉంటుందని స్టడీలు చెప్తున్నాయి. దాంతో పాటు ఇందులో ఇందులో విటమిన్ C, విటమిన్ B6, బీటా కెరొటిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. వింటర్ లో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండడంతో పాటు హైడ్రేటెడ్‌గానూ ఉండొచ్చు.

కాలీఫ్లవర్…

ఒక కప్పు కాలీ ఫ్లవర్‌‌తో 50 ఎంఎల్ నీరు లభిస్తుందని ఓ అంచనా. ఇందులో కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది. వింటర్‌‌లో క్యాలీ ఫ్లవర్ బెస్ట్ ఫుడ్‌గా పని కొస్తుంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ C, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్…

ఇకపోతే వింటర్‌‌లో వంట కోసం మిగతా నూనెల కన్నా ఆలివ్ నూనె బెస్ట్. ఎందుకంటే.. ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్.. శరీరానికి మంచి మాయిశ్చరైజర్‌‌గా పని చేస్తాయి ఇది వంటల్లోనే కాదు చర్మం మీద అప్లై చేసినా కూడా మంచిదే. ఇందులో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌తో పాటు, విటమిన్ E, ఐరన్ ఉంటాయి.

నీళ్లు మస్ట్…

ఇకపోతే.. వింటర్‌‌లో బాడీ టెంపరేచర్‌‌ని రెగ్యులేట్ చేయాలంటే తరచూ నీరు తాగడం అవసరం. వింటర్‌‌లో చలిగా, పొడిగా ఉండే వాతావరణం శక్తినంతా పీల్చేస్తుంది. దాంతో జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే తరచూ నీరు తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

తరచూ మూత్రం రాకుండా…

చలికాలంలో నీరు ఎక్కువగా తాగితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటప్పుడు ఆహారంలో కెఫెన్ డ్రింక్స్, సిట్రస్ ఫ్రూట్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్, చాకొలేట్, స్పైసీ ఫుడ్స్, ఆర్టిఫీషియల్ స్వీటనర్స్, మిల్క్ ప్రోడక్ట్స్, హై షుగర్, ఆల్కహాల్ ప్రోడక్ట్స్ వంటివాటిని అవాయిడ్ చేస్తే బ్లాడర్ ఓవరాక్టివ్ అవ్వకుండా ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సిన ఇబ్బంది ఉండదు.

Advertisement

Similar News