ఆ రంగేంది? ఈ నెయ్యేంది? " వైసీపీ ఫ్యాన్స్ చికాకు
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వైసీపీ సోషల్ మీడియా ఉతికేసేది. చంద్రబాబు హెరిటేజ్ ఉత్పత్తులపైనా అనేక సెటైర్లు వేసేవారు. బాబు మీద కోపంతో హెరిటేజ్ పాలు కూడా తాగని వైసీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వైసీపీ అభిమానులు కొన్ని చిన్నచిన్న విషయాల్లో చికాకుపడుతున్నారు. అందులో ఒకటి అధికారిక కార్యక్రమాలకు, కార్యాలయాల్లో ఉంచేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోను అధికారులు ఎంపిక చేశారు. ఆ ఫొటోపైనా వైసీపీ […]
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వైసీపీ సోషల్ మీడియా ఉతికేసేది. చంద్రబాబు హెరిటేజ్ ఉత్పత్తులపైనా అనేక సెటైర్లు వేసేవారు. బాబు మీద కోపంతో హెరిటేజ్ పాలు కూడా తాగని వైసీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వైసీపీ అభిమానులు కొన్ని చిన్నచిన్న విషయాల్లో చికాకుపడుతున్నారు.
అందులో ఒకటి అధికారిక కార్యక్రమాలకు, కార్యాలయాల్లో ఉంచేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటోను అధికారులు ఎంపిక చేశారు. ఆ ఫొటోపైనా వైసీపీ నెటిజన్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఫొటోలో జగన్ ఫేస్ ధీనంగా ఉన్నట్టుగా ఉండడంతో ఆ ఫొటో ఆ పార్టీ వారికి నచ్చడం లేదు. ఇలా ధీనంగా ఉన్న ఫొటో కాకుండా నవ్వుతూ ఉన్న ఫొటోను వాడాలంటూ సూచిస్తున్నారు.
ఇంతలో టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన బరువు నెయ్యిని స్వామి వారికి సమర్పించారు. అలా తులాభారం కోసం హెరిటేజ్ నెయ్యిని వైవీ సుబ్బారెడ్డి వాడారు. ఆ ఫొటోలను కూడా బయటకు వదిలారు. దాంతో మొన్నటి వరకు హెరిటేజ్‌పై జోకులేసిన వైసీపీ నెటిజన్లు ఇరుకునపడగా… టీడీపీ నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు.
దీనికి తోడు ఇకపై ప్యాకెట్ల రూపంలో రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్యాకెట్ల నమూన విడుదల చేశారు. అయితే ఈ ప్యాకెట్ కలర్ టీడీపీ పచ్చ రంగులో ఉండడంతో వైసీపీ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేం డిజైన్ అంటూ వాపోతున్నారు.
పచ్చరంగుపై తాము జగన్, వైఎస్ బొమ్మలను చూడలేకపోతున్నామంటున్నారు. కానీ వాళ్ల గోడు ఎవరు పట్టించుకుంటారు? ఇవి అలా నడిచిపోతుంటాయి.