ఆసియా కప్ గ్రూప్ లీగ్ లోనే దాయాదుల సమరం

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా ఐదోర్యాంకర్ పాకిస్థాన్ 2017 తర్వాత తొలిసారిగా పోటీ నువ్వానేనా అంటున్న టీమిండియా, పాక్ ఆసియాకప్ గ్రూప్- బీ లీగ్ లోనే అతిపెద్ద సమరానికి… చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు సై అంటే సై అంటున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకు ఈ బిగ్ ఫైట్ ప్రారంభమవుతుంది. గల్ఫ్ దేశాలలోని లక్షలాదిమంది భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు ఈ పోటీ కోసం ఉత్కంఠతో […]

Advertisement
Update:2018-09-18 16:25 IST
  • వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా
  • ఐదోర్యాంకర్ పాకిస్థాన్
  • 2017 తర్వాత తొలిసారిగా పోటీ
  • నువ్వానేనా అంటున్న టీమిండియా, పాక్

ఆసియాకప్ గ్రూప్- బీ లీగ్ లోనే అతిపెద్ద సమరానికి… చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు సై అంటే సై అంటున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 5 గంటలకు ఈ బిగ్ ఫైట్ ప్రారంభమవుతుంది. గల్ఫ్ దేశాలలోని లక్షలాదిమంది భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు ఈ పోటీ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2017 ఐసీసీ మినీ ప్రపంచకప్ తర్వాత.. తిరిగి ఈ రెండుజట్లూ పోటీపడబోతున్నాయి…..

ప్రపంచ క్రికెట్లో… ఫార్మాట్ ఏదైనా…. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు ఢీ కొంటే….. ఆ మజాయే వేరు. ఇటు మెన్-ఇన్- బ్లూ….అటు గ్రీన్ బ్రిగ్రేడ్ జట్లు పోటీపడుతుంటే… మ్యాచ్ ముగిసే వరకూ… ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒకటే ఉత్కంఠ.2017 ఐసీసీ మినీ ప్రపంచకప్ కమ్ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత…. ఈ రెండుజట్లూ మరోసారి ముఖాముఖీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన 2018 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ… ఒకే గ్రూపులో ఈ దాయాది జట్లు సమరానికి సై అంటున్నాయి.

గ్రూప్- ఏ లీగ్ లో భాగంగా… ఆడిన తొలిరౌండ్ పోటీలలో ఈ రెండుజట్లు పసికూన హాంకాంగ్ తో పోటీపడటం ద్వారా… సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించడం ఖాయమే అయినా…. గ్రూప్ పోటీలలో భాగంగా తలపడనున్నాయి. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం టీమిండియా రెండోర్యాంక్ లో ఉంటే…. పాకిస్థాన్ మాత్రం ఐదోర్యాంక్ జట్టుగా ఉంది. అంతేకాదు… ఆసియాకప్ లో ఈ రెండుజట్ల రికార్డులు చూసినా… టీమిండియా ఆధిపత్యమే కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఆరుసార్లు ఆసియాకప్ నెగ్గిన ఒకే ఒక్కజట్టు టీమిండియానే కావడం విశేషం.

మరోవైపు… పాక్ జట్టుకు మాత్రం… రెండుసార్లు ఆసియాకప్ విజేతగా నిలిచిన రికార్డు ఉంది. ఈ రెండుజట్లూ చివరిసారిగా… 2017 ఐసీసీ మినీ ప్రపంచకప్ ఫైనల్లో తలపడితే….పాక్ జట్టే విజేతగా నిలిచింది. ఆ తర్వాత మరోసారి… ప్రస్తుత ఆసియాకప్ లీగ్ మ్యాచ్ ద్వారా యుద్ధానికి సిద్ధమయ్యాయి.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సర్ ఫ్రాజ్ అహ్మద్ నాయకత్వంలో పాక్ జట్టు సవాలు విసురుతోంది. టీమిండియా రెగ్యుల్యర్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో…. స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టు పగ్గాలు చేపట్టాడు. రెండుజట్లూ టోర్నీ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే దుబాయ్ స్టేడియానికి చేరి… అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి వీలుగా సాధన ప్రారంభించాయి.

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మహేంద్రసింగ్ ధోనీ, హార్థిక్ పాండ్యా, అంబటి రాయుడు, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహాల్, బుమ్రా లాంటి ఆటగాళ్లతో టీమిండియా సమతూకంతో కనిపిస్తోంది. విరాట్ కొహ్లీ లేని లోటును పూడ్చగల సత్తా తమజట్టుకు ఉందని…. స్టాప్ గ్యాప్ కెప్టెన్ రోహిత్ శర్మ ధీమాగా చెబుతున్నాడు. ఇక… పాకిస్థాన్ సైతం… ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ను… టీమిండియా టాపార్డర్ పై తురుపుముక్కగా ప్రయోగించడానికి వ్యూహాలు సిద్ధం చేసుకొంది.

ఏదిఏమైనా… ఈ పోటీలో… ఏ జట్టు ఓడినా వచ్చిన నష్టం ఏమీలేదు. గ్రూప్ లీగ్ తో పాటు… ఒకే వేళ ఫైనల్స్ చేరినా…. టీమిండియా, పాక్ జట్లు.. మరో రెండుసార్లు తలపడాల్సి ఉంది. ఈ జట్లు ఎన్నిసార్లు పోటీపడినా…. తొలిసారిగా ఢీ కొన్న అనుభవమే రెండుజట్లకూ కలిగితీరుతుంది. మరి …ఈ దుబాయ్ ధమాకాలో….. పోటీ ఏ రేంజ్ లో ఉంటుదన్నదే ఇక్కడి అసలు పాయింట్.

Tags:    
Advertisement

Similar News