బాబు చేయడు... ఎవరినీ చేయనివ్వడు!
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. రాజధాని కూడా లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎంగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో ప్రజలు ఆనాడు చంద్రబాబుకి పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా చంద్రబాబు పని చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చినప్పుడు జరిగిన నష్టం కన్నా… టిడిపి ప్రభుత్వ విధానాల వల్ల ఎపి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర రాజధాని కోసమని యేడాదికి మూడు పంటలు పండే […]
By - sarviUpdate:2015-10-01 06:46 IST
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. రాజధాని కూడా లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి సీఎంగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో ప్రజలు ఆనాడు చంద్రబాబుకి పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా చంద్రబాబు పని చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చినప్పుడు జరిగిన నష్టం కన్నా… టిడిపి ప్రభుత్వ విధానాల వల్ల ఎపి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర రాజధాని కోసమని యేడాదికి మూడు పంటలు పండే భూములను రైతుల వద్ద నుంచి లాక్కోవడం… సంక్షేమ పధకాల అర్హులను ఎంపిక చేసే కమిటిలలో సభ్యులుగా టిడిపి కార్యకర్తలను నియమించడం… ఇసుక విధానం మొదలైన వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాష్ట్రానికి లబ్ది చేకూర్చాల్సిన పథకాలను, ప్రయోజనాలను కూడా కేంద్రం నుంచి రాబట్టడంలో చంద్రబాబు పెద్దగా ఆస్తకి ప్రదర్శించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ప్రత్యేకహోదాను… నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యాడు అని అనడం కంటే… ఓటుకు నోటు కేసులో తనను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద పణంగా పెట్టాడనవచ్చు. పీకల్లోతూ కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి… భవిష్యత్ ఏమిటో తెలియక అయోమయంలో బతుకుతున్న ప్రజలకు ప్రత్యేకహోదానే సంజీవిని. ప్రత్యేకహోదా వస్తే ఎపికి పరిశ్రమలొచ్చి రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు… రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగవకాశలొస్తాయి. ఇంతటి ముఖ్యమైన ప్రత్యేకహోదా సాధాన కోసం పోరాటం చేయకపోగా… ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షను అడ్డుకోవడం మంచిది కాదు. ఇలాంటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. – సవరం నాని