ముద్రా బ్యాంకు వల్ల ఉపాధి కల్పన: వెంకయ్య
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంకు వల్ల చిన్నచిన్న వ్యాపారులకు ఉపాధి కల్పన ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో ముద్రా బ్యాంకుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువకుల్లో ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపేందుకే ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశామని తెలిపారు. దీనివల్ల పేదలకు ఉపాధి కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడం కష్టమని, కాని ఇలాంటి బ్యాంకుల వల్ల స్వయం ఉపాధికి వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.