'పట్టణ జ్యోతి' కూడా చేపడతాం: కేసీఆర్‌

రాష్ట్రంలో గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పలు పట్టణాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం పట్టణ జ్యోతి కార్యక్రమం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిత్తశుద్ధి, పట్టుదల ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేసిన చోట మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ దేశం దృష్టిని ఆకర్శించిందని […]

Advertisement
Update:2015-07-31 07:46 IST
రాష్ట్రంలో గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పలు పట్టణాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం పట్టణ జ్యోతి కార్యక్రమం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. గ్రామజ్యోతి కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిత్తశుద్ధి, పట్టుదల ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేసిన చోట మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ దేశం దృష్టిని ఆకర్శించిందని వివరించారు. ఈ పథకాన్ని నీతి ఆయోగ్ అధికారులు, హైకోర్టు, కేంద్ర మంత్రులు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామజ్యోతిని నిర్వహించాలని కోరారు. గోదావరి పుష్కరాలను అధికారులు అద్బుతంగా నిర్వహించారని అన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేయింబవళ్లు కష్టపడి పని చేశారని కితాబిచ్చారు. పోలీసులు చాలా మర్యాదగా ప్రవర్తించారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.
గ్రామాల్ని తీర్చిదిద్దే ప్రణాళికలివ్వండి
వరంగల్ జిల్లాలో ఆదర్శప్రాయమైన గంగదేవిపల్లి గ్రామంలో ఉన్నట్టు కమిటీలు వేసి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో ప్రణాళికలను రూపొందించాలని.. ఇందుకు కావాల్సిన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రజలంతా కలిసి కొద్దిపాటి శ్రమదానం చేయాలని సీఎం కోరారు. గ్రామ కార్యదర్శుల పోస్టుల భర్తీ సహా అవసరమైన సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఇసుక, వాణిజ్య పన్నులు, తదితర నిధులను స్థానిక సంస్థలకు ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆదేశించారు.
Tags:    
Advertisement

Similar News