సరిహద్దు మీరైనా ఉగ్రపై ఉక్కు పాదం!
దేశంలో దాడులు చేసి సరిహద్దు అవతలి దేశాల్లో తలదాచుకొంటున్న తీవ్రవాదులను ఏరివేసే పనిని మోడీ సర్కారు మొదలు పెట్టింది. మయన్మార్‌లోకి చొచ్చుకెళ్లి మణిపురి తీవ్రవాదులను కాల్చిచంపడంతో ‘పొరుగు’ పోరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందనేది స్పష్టమైంది. మణిపూర్‌లో ఈనెల 4న ఎన్‌ఎస్‌సీఎన్-కే తీవ్రవాదుల మెరుపుదాడిలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన ఐదు రోజులకే, భారత్ సరిహద్దులకు ఆనుకొని ఉన్న మయన్మార్ భూభాగంలోకి మన సైన్యం చొచ్చుకెళ్లి పెద్ద ఎత్తున తీవ్రవాదులను మట్టుబెట్టింది. 45 నిమిషాల్లోనే […]
Advertisement
దేశంలో దాడులు చేసి సరిహద్దు అవతలి దేశాల్లో తలదాచుకొంటున్న తీవ్రవాదులను ఏరివేసే పనిని మోడీ సర్కారు మొదలు పెట్టింది. మయన్మార్‌లోకి చొచ్చుకెళ్లి మణిపురి తీవ్రవాదులను కాల్చిచంపడంతో ‘పొరుగు’ పోరుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందనేది స్పష్టమైంది. మణిపూర్‌లో ఈనెల 4న ఎన్‌ఎస్‌సీఎన్-కే తీవ్రవాదుల మెరుపుదాడిలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన ఐదు రోజులకే, భారత్ సరిహద్దులకు ఆనుకొని ఉన్న మయన్మార్ భూభాగంలోకి మన సైన్యం చొచ్చుకెళ్లి పెద్ద ఎత్తున తీవ్రవాదులను మట్టుబెట్టింది. 45 నిమిషాల్లోనే ఆర్మీ ఆపరేషన్‌ను పూర్తి చేసి 100 మందికి పైగా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. పొరుగు దేశాల్లో తీవ్రవాద శిబిరాలు నడుపుతూ, భారత్‌పై దాడులకు ప్రయత్నించే సంస్థలకూ ఇదే గతి పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. చొరబాటు తీవ్రవాదాన్ని సహించబోమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. అవసరమైతే పొరుగు దేశాల భూభాగంలోకి ప్రవేశించేందుకూ వెనుదీసేది లేదని మరో మంత్రి జావదేకర్ హెచ్చరించారు. ఇకనైనా పాక్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ హెచ్చరించారు.
Advertisement