Telugu Global
Agriculture

మహిళా రైతులకు అనువుగా మహీంద్రా ట్రాక్టర్లు

మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ సెక్టార్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ సిక్కా

మహిళా రైతులకు అనువుగా మహీంద్రా ట్రాక్టర్లు
X

మహిళా రైతులకు అనుగువుగా మహీంద్రా ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తున్నామని ఆ సంస్థ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ సెక్టార్‌ ప్రెసిడెంట్‌, ఫిక్కి నేషనల్‌ అగ్రికల్చర్‌ కమిటీ కో చైర్మన్‌ హేమంత్‌ సిక్కా అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సబ్‌ - మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌ (ఎస్ఎంఏఎం) లో భాగంగా వ్యవసాయ యంత్రాలపై 50 నుంచి 80 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇందులో మహిళా రైతులకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ ట్రాక్టర్ల వినియోగంతో మహిళా రైతుల శ్రమ గణనీయంగా తగ్గించి పంట ఉత్పత్తులు పెంచవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని.. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు తమ సంస్థ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. మహిళా రైతులు శాస్త్రసాంకేతికతను అందిపుచ్చుకొని దేశ అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పత్తులు సాధించాలని ఆకాంక్షించారు.

First Published:  28 Feb 2025 5:43 PM IST
Next Story