Telugu Global
National

పరుగులో నూరేళ్ల బామ్మలు భళా! నిన్న మాన్ కౌర్..నేడు రాంబాయి

ఈరోజుల్లో చాలామంది నాలుగు పదుల వయసులోనే నాలుగడుగులు వేయటానికి ఆపసోపాలు పడుతుంటే ..హర్యానా, పంజాబ్ రాష్ట్ర్రాలకు చెందిన వందేళ్ల బామ్మలు. ఏకంగా జాతీయ, అంతర్జాతీయ పరుగు పోటీలలో పాల్గొంటూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు. 105 ఏళ్ల వయసులో… ముదిమివయసులో పరుగెత్తడానికి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని హర్యానాకు చెందిన 105 సంవత్సరాల బామ్మ రాంబాయి మరోసారి చాటి చెప్పారు. బరోడా వేదికగా ముగిసిన 2022 జాతీయ మాస్టర్స్ ట్రాక్ అండ్ […]

at-105-years-super-grandma-sprints-to-new-100m-recor
X

ఈరోజుల్లో చాలామంది నాలుగు పదుల వయసులోనే నాలుగడుగులు వేయటానికి ఆపసోపాలు పడుతుంటే ..హర్యానా, పంజాబ్ రాష్ట్ర్రాలకు చెందిన వందేళ్ల బామ్మలు. ఏకంగా జాతీయ, అంతర్జాతీయ పరుగు పోటీలలో పాల్గొంటూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు.

105 ఏళ్ల వయసులో…

ముదిమివయసులో పరుగెత్తడానికి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని హర్యానాకు చెందిన 105 సంవత్సరాల బామ్మ రాంబాయి మరోసారి చాటి చెప్పారు. బరోడా వేదికగా ముగిసిన 2022 జాతీయ మాస్టర్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో రాంబాయి 100 మీటర్ల దూరాన్ని 45.40 సెకన్ల సమయంలో పరుగెత్తి సరికొత్త రికార్డు నమోదు చేయడం ద్వారా బంగారు పతకం గెలుచుకొన్నారు. ఆ తర్వాత జరిగిన 200 మీటర్ల పరుగులో సైతం రాంబాయి విజేతగా నిలవడం ద్వారా రెండో స్వర్ణపతకం అందుకొన్నారు. గతంలో పంజాబ్ రన్నర్ మాన్ కౌర్ 100 మీటర్ల పరుగులో నెలకొల్పిన 74 సెకన్ల జాతీయ రికార్డును రాంబాయి అధిగమించారు.

అంతర్జాతీయస్థాయిలో మాన్ కౌర్…

అయితే..ప్రపంచ మాస్టర్స్ విభాగంలో రాణించిన రన్నర్ గా మాత్రం పంజాబ్ కు చెందిన మాన్ కౌర్ కు గుర్తింపు, పలు రికార్డులు ఉన్నాయి. కెనడాలోని వాంకోవర్ నగరంలో ముగిసిన 2015 మాస్టర్ గేమ్స్ లో మాన్ కౌర్ 101 సంవత్సరాల వయసులో బరిలో నిలిచింది. ఏకంగా బంగారు పతకం గెలుచుకొంది. ఆ తర్వాత న్యూజిలాండ్ లో ముగిసిన మాస్టర్స్ మీట్ 100 మీటర్ల పరుగులో సైతం స్వర్ణవిజేతగా నిలిచింది.

93 ఏళ్ల వయసులో సాధన…

పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్ కు చెందిన మాన్ కౌర్ 93 సంవత్సరాల వయసు నుంచే పరుగులో సాధన మొదలుపెట్టింది. ఒకటికాదు రెండు కాదు..ఏకంగా నాలుగు (100 మీటర్లు , 200 మీటర్లు పరుగు పందెంతో పాటు.షాట్ పుట్ , జావెలిన్ త్రో) విభాగాలలో పోటీకి దిగడం ద్వారా వయసుతో పనిలేదని తేల్చి చెప్పింది. 101 సంవత్సరాల వయసులోనూ 79 సంవత్సరాల తన కుమారుడితో కలిసి పటియాలలోని పంజాబ్ యూనివర్శిటీలో… నెలల తరబడి సాధన చేస్తూ వచ్చింది. ఈ బామ్మకు..వంద మీటర్ల పరుగులో ఒక నిముషం 10సెకన్ల తో మంచి రికార్డు ఉంది. 2011 లో నేషనల్ మాస్టర్స్ మీట్ లో 100 మీటర్లు , 200 మీటర్లు విభాగాల్లో మెడల్స్ సాధించింది.

10 సంవత్సరాలలో 20 పతకాలు..

93 సంవత్సరాల వయసు నుంచి 103 సంవత్సరాల వరకూ జాతీయ, అంతర్జాతీయ పరుగు పోటీలలో పాల్గొన్న మాన్ కౌర్..20కి పైగా పతకాలు సాధించారు. పదేళ్లపాటు తన పరుగును కొనసాగించడం ద్వారా చరిత్ర సృష్టించారు. పరుగెడుతుంటే తన మనసు హాయిగా, ఆహ్లాదంగా ఉంటుందని, క్రమశిక్షణ, నియమబద్ధమైన జీవితానికి పరుగే ఆలంబన అని మాన్ కౌర్ తన అనుభవాన్ని వివరిస్తూ ఉండేవారు.

మాంసాహారానికి దూరంగా…

102 సంవత్సరాల వయసులో తన తల్లి అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించడం, ఫిట్ గా ఉండటం వెనుక కష్టపడే తత్వం, పట్టుదల, అంకితభావం ఉన్నాయని, దీనికితోడు..జీవితంలో నడకను ఓ భాగంగా చేసుకోడం, జంక్ ఫుడ్, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటమే ప్రధాన కారణాలని..బామ్మగారి కుమారుడు గురుదేవ్ సింగ్ తెలిపాడు. కెనడాలోని వాంకోవర్ గేమ్స్ లో మాన్ కౌర్ పాల్గొన్న సమయంలో ఆమె పట్టుదల, అంకితభావాన్ని చూసి…నిర్వాహక సంఘం చైర్మన్ క్రూక్స్ అబ్బురపడిపోయారు. మాన్ కౌర్ ను ..క్వీన్ ఆఫ్ విమెన్ స్పోర్ట్ అంటూ ప్రశంసించారు. మాన్ సింగ్ నూరేళ్ల వయసులో పడిన తర్వాత ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోడం విశేషం. న్యూజిలాండ్ లోని అక్లాండ్ ప్రపంచ క్రీడల్లోనూ…. ఈ గ్రేట్ ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ లేడీ..100 మీటర్ల పరుగులో స్వర్ణపతకం సాధించి భారత్ కే గర్వకారణంగా నిలిచారు. ఇటీవలే కన్నుమూసిన మాన్ కౌర్ స్ఫూర్తితో ఎందరో శతాధిక వృద్ధులు పరుగులో, ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పాల్గొంటూ…పరుగుకు వయసుతో సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  23 Jun 2022 4:29 AM IST
Next Story