పేదల చదువంటే చంద్రబాబుకి అక్కసు – మంత్రి సురేష్
పేదలు చదువుకుంటే చంద్రబాబుకి మనసొప్పదని, అందుకే ఆయన అన్ని పథకాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే.. బాబుకి కడుపుమంట ఎందుకని నిలదీశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను ఆయన చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ […]
పేదలు చదువుకుంటే చంద్రబాబుకి మనసొప్పదని, అందుకే ఆయన అన్ని పథకాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారాయన.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం బైజూస్ తో ఒప్పందం చేసుకుంటే.. బాబుకి కడుపుమంట ఎందుకని నిలదీశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను ఆయన చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు.
ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుందని చెప్పారు మంత్రి సురేష్. ప్రభుత్వ విద్యలో ఇది ఒక గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డారాయన. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది ఓ గొప్ప అవకాశమని చెప్పారు.
బైజూస్ కంటెంట్ కోసం ఒక్కో విద్యార్థి 20వేల నుంచి 25వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్ పాఠశాలల్లో ఇలాంటి కంటెంట్ కి అదనంగా ఫీజులు తీసుకుంటారని, కానీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఈ కంటెంట్ ని ఉచితంగా అందిస్తుందని చెప్పారు. సీఎం జగన్ చొరవ వల్లే ఇది సాధ్యమైందని, దావోస్ లో ఒప్పందం ప్రకారం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్ అందించేందుకు బైజూస్ ముందుకొచ్చిందని అన్నారు.
అప్పుడు ఇంగ్లిష్ మీడియం.. ఇప్పుడు బైజూస్..
ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు, ఇప్పుడు బైజూస్ పై కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు మంత్రి సురేష్. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు ‘జూస్’ అంటూ హేళన చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు సురేష్.