Telugu Global
NEWS

తెలంగాణ హైకోర్టు సీజే గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్ నియామ‌కం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేశారు. భుయాన్ ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. […]

తెలంగాణ హైకోర్టు సీజే గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్ నియామ‌కం
X

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేశారు. భుయాన్ ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

అలాగే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి హైకోర్టులకు నూతన సీజేల నియామకానికి కూడా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచిన విష‌యం తెలిసిందే. సీజే సతీశ్‌చంద్ర శర్మ బదిలీతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కు తగ్గింది. ప్రస్తుతం హైకోర్టులో 15 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

భుయాన్ జీవిత విశేషాలు..
జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 1964 ఆగస్టు 2న గువాహటిలో జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ భుయాన్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్‌ భుయాన్‌ గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు. ఆయ‌న ట్యాక్స్‌ చట్టాల్లో విశేష అనుభవం అనుభ‌వం గ‌డించారు. 1991లో అసోం బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.

హైకోర్టులోని గువాహటి, అగర్తలా, షిల్లాంగ్‌, కోహిమా, ఇటానగర్‌ ధర్మాసనాల ఎదుట అనేక కేసులను వాదించారు. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) గువాహటి బెంచ్‌, అసోం బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఎదుట వివిధ కేసుల్లో హాజరయ్యారు. జస్టిస్‌ భుయాన్‌ ఆదాయ పన్ను శాఖ న్యాయవాదిగా 16 ఏళ్లపాటు పనిచేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా, మేఘాలయ ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేశారు. 2011లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా,2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.

First Published:  19 Jun 2022 10:39 PM IST
Next Story