ప్రొబేషన్ పూర్తి చేసిన సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ కానుక ఇవ్వబోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల డిక్లరేషన్ ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. దీంతో వీరికి కొత్త జీతాలు అందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయితే వారికి కొత్త వేతనాలు అందుతాయి. ఈ క్రమంలో ఇటీవల గ్రామ, వార్డు […]
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ కానుక ఇవ్వబోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల డిక్లరేషన్ ఫైలుపై ముఖ్యమంత్రి గురువారం సంతకం చేశారు. దీంతో వీరికి కొత్త జీతాలు అందనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులు అయితే వారికి కొత్త వేతనాలు అందుతాయి.
ఈ క్రమంలో ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించింది. 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, పరీక్షలో కూడా ఉత్తీర్ణులైన వారికి పాత స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అయితే.. వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జులై నుంచి వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో డిపార్ట్‌మెంటల్ పరీక్ష పాసైన 40 వేల మందికి కొత్త వేతనాలు అందనున్నాయి.
అధికార వికేంద్రికరణలో భాగంగా.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలకు ఉద్యోగులను నియమించారు. అప్పట్లో తాత్కాలిక ప్రాతిపదికన నియమించినా.. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు లభిస్తాయని చెప్పారు. హామీ ఇచ్చిన మేరకు.. రాష్ట్రంలోని 40 వేల మంది ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి జీతాలు అందుకోనున్నారు.
కాగా, ప్రొబేషన్ పూర్తి చేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిక్లరేషన్ చేసే అధికారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం వెలువడనున్నాయి.