Telugu Global
NEWS

స‌ర్వే చేయ‌మంటే.. క‌లెక్ష‌న్ మొద‌లెట్టారు

టీడీపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటీవల టీడీపీ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. అది కూడా సైలెంట్‌గా. ఇక్కడే కొందరు సర్వేరాయుళ్లకు కొత్త ఐడియా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేతలకు వల వేయడం మొదలుపెట్టారు. ” మీ నియోజకవర్గంలో సర్వే బాధ్యత మాకు అప్పగించారు. ముగ్గురు నలుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని కాస్త చూసుకుంటే.. మేం సర్వేలో మీకు అనుకూలంగా ఉన్నట్టు మీ పార్టీ నాయకత్వానికి […]

http://teluguglobal.in/2022/06/07/tdp-facing-new-problem-some-people-collecting-money-in-the-name-of-political-surveys/
X

టీడీపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటీవల టీడీపీ నాయకత్వం సర్వేలు చేయిస్తోంది. అది కూడా సైలెంట్‌గా. ఇక్కడే కొందరు సర్వేరాయుళ్లకు కొత్త ఐడియా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేతలకు వల వేయడం మొదలుపెట్టారు.

” మీ నియోజకవర్గంలో సర్వే బాధ్యత మాకు అప్పగించారు. ముగ్గురు నలుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మీరు మమ్మల్ని కాస్త చూసుకుంటే.. మేం సర్వేలో మీకు అనుకూలంగా ఉన్నట్టు మీ పార్టీ నాయకత్వానికి రిపోర్టు ఇస్తాం. మా రిపోర్టుతో మీకు టికెట్‌ ఖాయం” అంటూ ఎర వేసినట్టు చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో ఇదే అనుభవం టీడీపీ నేతలకు ఎదురైంది. శింగనమల నియోజకవర్గంలో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో పాటు.. వారి అనుచరులకు కూడా సర్వే బృందంలోని వ్యక్తులు ఫోన్లు చేసి నమ్మించినట్టు చెబుతున్నారు.

ఈ విషయాన్ని కొందరు జిల్లా పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విషయాన్ని జిల్లా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. గ్రౌండ్‌లో వాస్తవ పరిస్థితిపై రిపోర్టు ఇవ్వకుండా డబ్బు తీసుకుని రిపోర్టులు ఇస్తున్నారని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ స్పందించారు. సర్వేల పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వవద్దని పార్టీ నేతలకు సూచించారు. డబ్బు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఆ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. అయితే పార్టీ అధినాయకత్వం రంగంలోకి దింపిన సర్వే సంస్థలు ఏంటి?. డబ్బు వసూలు చేసిన వ్యక్తులు ఎవరు అన్న వివరాలను మాత్రం టీడీపీ వెల్లడించడం లేదు.

First Published:  7 Jun 2022 5:15 AM GMT
Next Story