Telugu Global
MOVIE UPDATES

ఎఫ్3 ఓటీటీ స్ట్రీమింగ్ పై టీమ్ క్లారిటీ

ఎఫ్3 నిర్మాతలు సినిమా ఓటీటీ విడుదలపై మొదటి నుండి చాలా క్లారిటీతో ఉన్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత కొన్ని వారాల్లోనే సినిమా ఏ ఓటీటీ వేదిక లోనూ విడుదల కాదని నిర్మాతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. 8 వారాల థియేట్రికల్ రన్‌ కు ముందు, ఎఫ్3 స్ట్రీమింగ్ కు రాదని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన […]

f3-ott-streaming
X

ఎఫ్3 నిర్మాతలు సినిమా ఓటీటీ విడుదలపై మొదటి నుండి చాలా క్లారిటీతో ఉన్నారు. థియేట్రికల్ విడుదల తర్వాత కొన్ని వారాల్లోనే సినిమా ఏ ఓటీటీ వేదిక లోనూ విడుదల కాదని నిర్మాతలు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. 8 వారాల థియేట్రికల్ రన్‌ కు ముందు, ఎఫ్3 స్ట్రీమింగ్ కు రాదని మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఎఫ్ 3ని థియేటర్ లో చూడకపోయినా 4 వారాల్లో ఓటీటీకి వస్తుందని అనుకున్నారు కదా.. ఇట్స్ నాట్ కమ్మింగమ్మా .. నాలుగు వారాల్లో రాదమ్మా..ఎనిమిది వారాల తర్వాతే వస్తుందమ్మా .. రెండు నెలల తర్వాత ఓటీటీకి వస్తుంది., సో అందరూ థియేటర్లకే వచ్చి ఎఫ్3ని చూసి ఈ సమ్మర్ లో సరదాగా నవ్వుకోండి” అని వెల్లడించారు.

ఈ ప్రకటనతో ఎఫ్3 సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదనే క్లారిటీ వచ్చేసింది. ఇలా క్లారిటీ ఇవ్వడం వల్ల సినిమాకు రిపీట్ ఆడియన్స్ పెరుగుతారని యూనిట్ భావిస్తోంది. పైగా ఓటీటీలో వస్తుందని ఇప్పటివరకు చూడకుండా ఉన్న ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారని నమ్ముతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సోనీ లివ్ దక్కించుకుంది.

మరి వీళ్ల ఎత్తుగడ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఎఫ్3 సినిమాలో వెంకీ, వరుణ్ హీరోలుగా నటించారు. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాను శిరీష్ నిర్మించగా, దిల్ రాజు ప్రజెంట్ చేశాడు

ALSO READ : మిషన్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ

First Published:  2 Jun 2022 2:50 PM IST
Next Story