బ్లాక్ కమాండో మెడల్ అందుకున్న హీరో
మేజర్ సినిమా విడుదలకు ముందే హీరో అడివి శేష్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆల్రెడీ తన సినిమా పెద్ద హిట్ అంటున్నాడు. దీనికి కారణం అతడు అందుకున్న ఓ అవార్డ్. అవును.. మేజర్ మూవీ విడుదలకు ముందే ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నాడు శేష్. ఆస్కార్ కంటే పెద్ద అవార్డ్ అంటున్నాడు. “ముంబైలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు సినిమా చూపించాం. అందులో ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ సందీప్. అక్కడ 312 కుటుంబాలు సినిమా చూశారు. కానీ అంతా నిశ్శబ్ద వాతావరణం […]
మేజర్ సినిమా విడుదలకు ముందే హీరో అడివి శేష్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆల్రెడీ తన సినిమా పెద్ద హిట్ అంటున్నాడు. దీనికి కారణం అతడు అందుకున్న ఓ అవార్డ్. అవును.. మేజర్ మూవీ విడుదలకు ముందే ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నాడు శేష్. ఆస్కార్ కంటే పెద్ద అవార్డ్ అంటున్నాడు.
“ముంబైలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు సినిమా చూపించాం. అందులో ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ సందీప్. అక్కడ 312 కుటుంబాలు సినిమా చూశారు. కానీ అంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దాంతో మాకు అనేక అనుమానాలు వచ్చాయి. ఆరోజు రాత్రి 11.30 గంటలకు హెడ్ క్వార్టర్స్‌కు రమ్మని మాకు ఫోన్ వచ్చింది. మేకింగ్ ఏదైనా తప్పుచేశామోననే భయంతో వెళ్ళాం. కానీ మా టీమ్ కు వారు ఓ మెడల్ బహూకరించారు. నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ ఇది. అక్కడ సందీప్ విగ్రహం కూడా వుంది. ఈ మెడల్ అందుకోవడం ఆస్కార్ కన్నా గొప్పవిషయం.”
ఇలా తన సినిమాకు దక్కిన అరుదైన గౌరవాన్ని బయటపెట్టాడు హీరో అడివి శేష్. వైజాగ్ లో జరిగిన ఫంక్షన్ లో ఆ మెడల్ ను మీడియాకు చూపించాడు.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే తొలిసారిగా.. సినిమా చూపించిన తర్వాత మేజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ తెలుగు, హిందీలో తీశారు. హైదరాబాద్ లో తెలుగు వారు చేసిన ఇండియన్ ఫిలిం మేజర్. ఇందులో నటించిన వారంతా తెలుగులో తమ పాత్రలకు తామే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారట.