దావోస్ ఫస్ట్ డే రిజల్ట్.. వెల్కమ్ టు స్విస్ రే..
ఎ బిగ్ వెల్కమ్ టు స్విస్ రే (@SwissRe) అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. దావోస్ పర్యటన తొలిరోజే ఆయన పెద్ద కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం తరపున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు స్విట్జర్లాండ్ దిగ్గజ కంపెనీ స్విస్ రే.. త్వరలో తెలంగాణలో తన కార్యకలాపాలు మొదలు పెడుతుంది. ఒప్పందం ఖరారైన సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్లో ఆ సంస్థకి స్వాగతం పలికారు. స్విస్ రే కంపెనీ నేపథ్యం ఏంటి..? 160 ఏళ్ల చరిత్ర ఉన్న […]
ఎ బిగ్ వెల్కమ్ టు స్విస్ రే (@SwissRe) అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. దావోస్ పర్యటన తొలిరోజే ఆయన పెద్ద కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం తరపున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు స్విట్జర్లాండ్ దిగ్గజ కంపెనీ స్విస్ రే.. త్వరలో తెలంగాణలో తన కార్యకలాపాలు మొదలు పెడుతుంది. ఒప్పందం ఖరారైన సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్లో ఆ సంస్థకి స్వాగతం పలికారు.
స్విస్ రే కంపెనీ నేపథ్యం ఏంటి..?
160 ఏళ్ల చరిత్ర ఉన్న బీమా సంస్థ స్విస్ రే. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ దీని ప్రధాన కేంద్రం. ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయంగా 80 చోట్ల వ్యాపార కార్యకలాపాలు సొనసాగిస్తోంది. భారత్ లో ముంబై, బెంగళూరులో ఆఫీస్ లు ఉన్నాయి. తొలిసారిగా హైదరాబాద్ లో ఈ సంస్థ తన ఆఫీస్ ఏర్పాటు చేయబోతోంది. ఆగస్ట్ నుంచి హైదరాబాద్ లో స్విస్ రే కంపెనీ కార్యకలాపాలు మొదలవుతాయి. 250 మందితో ఇక్కడ ఆఫీస్ మొదలవుతుంది. డేటా, డిజిటల్ కేపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ఈ కంపెనీ దృష్టిసారిస్తుంది. ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన అనంతరం స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో హైదరాబాద్ కి మరిన్ని పెట్టుబడులు తెచ్చే వ్యూహంలో భాగంగా స్విస్ రే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగురోజులపాటు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కేటీఆర్ పాల్గొంటున్నారు. యూకే పర్యటనలో భాగంగా.. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఆయన.. దావోస్ లో స్విస్ రే తో తొలిరోజు ఖాతా తెరిచారు. మరిన్ని ప్రముఖ సంస్థలకు భారత్ లో హైదరాబాద్ ని కేంద్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్.