కరోనా మృతదేహాలను మోస్తున్న బాలుడు
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా పేరు చెబితేనే భయపడుతున్నారు. ఎవరికైనా కరోనా వస్తే వారిని వెంటనే ఐసోలేషన్‌కు పంపుతున్నారు. కోవిడ్-19 వచ్చి.. తిరిగి నయమైనా సరే వారి వంక చూడటానికి కూడా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక బాలుడు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను మోస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్య కలుగక మానదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు రంగాల్లో ఉపాధి కరువయ్యింది. ఉన్న చిన్నపాటి ఉద్యోగాలు కూడా పోయి కుటుంబ పోషణ కూడా భారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి […]
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా పేరు చెబితేనే భయపడుతున్నారు. ఎవరికైనా కరోనా వస్తే వారిని వెంటనే ఐసోలేషన్‌కు పంపుతున్నారు. కోవిడ్-19 వచ్చి.. తిరిగి నయమైనా సరే వారి వంక చూడటానికి కూడా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక బాలుడు కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను మోస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్య కలుగక మానదు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు రంగాల్లో ఉపాధి కరువయ్యింది. ఉన్న చిన్నపాటి ఉద్యోగాలు కూడా పోయి కుటుంబ పోషణ కూడా భారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి చెందిన చాంద్ మొహమ్మద్ తన కుటుంబం ఆకలి తీర్చడానికి కరోనా మృతదేహాలను మోస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు చాంద్ అన్న ఒక బట్టల దుకాణంలో పని చేసేవాడు. ఆ దుకాణం మూతపడటంతో ఏడుగురు సభ్యులున్న వారి కుటుంబం పస్తులుండాల్సి వచ్చింది.
ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న చాంద్.. ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో కరోనా మృతదేహాలు మోసే పనికి కుదిరాడు. ఈ తాత్కాలిక ఉద్యోగానికి రూ. 17 వేల రూపాయల వేతనం ఇస్తున్నారు. అతనికి కనీసం బీమా సౌకర్యం కూడా లేదు. అతనికి ఏమైనా జరిగితే కుటుంబం మళ్లీ పస్తులుండాల్సిందే. ఈ విషయం బయటకు తెలియడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాంద్ చేస్తున్న పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. అలాగే ప్రభుత్వం చాంద్‌కు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.