హైకోర్టుకు బిగ్ బాస్... షోపై నీలినీడలు...
బిగ్ బాస్.. బిగ్ బాస్.. జూలై21న మొదలయ్యే ఈ షో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా షో నడవడంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. షో చుట్టూ తీవ్ర వివాదాలు చెలరేగడంతో హోస్ట్ నాగార్జున కూడా ఈ విషయంలో చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా నాగార్జునను కూడా ప్రతివాదిగా చేరుస్తూ కొందరు హైకోర్టుకెక్కడంతో షో పెద్ద వివాదంలో చిక్కుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడానికి ఎంపికైన వారు బయటకొచ్చి కేసులు పెట్టడం.. మీడియాకు ఎక్కడంతో దీనిపై వివాదాలు చెలరేగాయి. […]

బిగ్ బాస్.. బిగ్ బాస్.. జూలై21న మొదలయ్యే ఈ షో కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా షో నడవడంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. షో చుట్టూ తీవ్ర వివాదాలు చెలరేగడంతో హోస్ట్ నాగార్జున కూడా ఈ విషయంలో చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా నాగార్జునను కూడా ప్రతివాదిగా చేరుస్తూ కొందరు హైకోర్టుకెక్కడంతో షో పెద్ద వివాదంలో చిక్కుకుంది.
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడానికి ఎంపికైన వారు బయటకొచ్చి కేసులు పెట్టడం.. మీడియాకు ఎక్కడంతో దీనిపై వివాదాలు చెలరేగాయి. బిగ్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతరెడ్డి, నటి గాయత్రి గుప్తాలు పోలీసు కేసులు కూడా పెట్టారు.
ఈ పోలీస్ కేసులపై తాజాగా బిగ్ బాస్ టీం హైకోర్టును ఆశ్రయించింది. క్యాష్ పిటీషన్ ను బిగ్ బాస్ నిర్వాహకులు దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు.
కాగా తాజాగా పెద్ద ఎత్తున వివాదాలు రావడంతో బిగ్ బాస్ 3ని నిలిపివేయాలని కొందరు సామాజికవేత్తలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
సినిమాలలో లాగానే బిగ్ బాస్ ఎపిసోడ్ లను సెన్సార్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాత్రి11గంటల తర్వాతే ప్రోగ్రాంను ప్రసారం చేయాలని పిటీషనర్ కోరారు.
ఇందులో నాగార్జునతోపాటు 10 మందిని ప్రతివాదులుగా పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో షో ప్రసారం పై నీలినీడలు కమ్ముకున్నాయి. హోస్ట్ అయిన నాగార్జున కూడా తొలిసారి వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.