Telugu Global
Health & Life Style

ఆనపకాయ... ఆరోగ్యమయ్యా...

దీనిని సొరకాయ అని కూడా పిలుస్తారు. పొట్టిగా… గుండ్రంగా ఉండే దానిని ఆనపకాయ అని, సన్నగా… పొడుగ్గా ఉంటే సొరకాయ అని పిలుస్తారు. ఇందులో ఆనపకాయ ఆంధ్రప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇక సొరకాయను తెలంగాణలో విరివిగా పండిస్తారు. ఈ రెండూ కూడా ఒకే రకమైన గుణాలను కలిగి ఉంటాయి. దీనిలో 90 శాతం నీరు ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. ఇందులో అధిక శాతంలో ఫైబర్… బిపీ, షుగర్ లను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్న […]

ఆనపకాయ... ఆరోగ్యమయ్యా...
X

దీనిని సొరకాయ అని కూడా పిలుస్తారు. పొట్టిగా… గుండ్రంగా ఉండే దానిని ఆనపకాయ అని, సన్నగా… పొడుగ్గా ఉంటే సొరకాయ అని పిలుస్తారు. ఇందులో ఆనపకాయ ఆంధ్రప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇక సొరకాయను తెలంగాణలో విరివిగా పండిస్తారు. ఈ రెండూ కూడా ఒకే రకమైన గుణాలను కలిగి ఉంటాయి.

  • దీనిలో 90 శాతం నీరు ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది.
  • ఇందులో అధిక శాతంలో ఫైబర్… బిపీ, షుగర్ లను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్ ను బ్యాలెన్స్ డ్ గా ఉంచుతుంది.
  • అనపకాయలో విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్ లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • మలబద్దకంతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ లేదా ఆహారంలో ఏదో రూపంలో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
  • శరీరంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను అదుపు చేస్తుంది.
  • కడుపులో ఎటువంటి ఇన్ ఫెక్షన్ నైనా సరే సొరకాయ జ్యూస్ మూడు రోజులు తాగితే వెంటనే తగ్గిపోతుంది.
  • చర్మం పొడి బారకుండా నిగనిగలాడాలంటే….. అనేక చర్మ సమస్యలకు ఆనపకాయ దివ్యౌషధం.
  • శరీరంలో ఉన్న సోడియం లెవల్స్ ను బ్యాలెన్స్ డ్ గా ఉంచేందుకు దోహదపడుతుంది.
  • వేసవి కాలంలో సొరకాయ జ్యూస్ వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  • మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న వారు సొరకాయ జ్యూస్ లో నిమ్మరసం కలుపుకుని తాగితే ఆ బాధనుంచి బయటపడతారు.
  • చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడుతుంటే అలాంటి వారు సొరకాయ జ్యూస్ తాగితే తగ్గిపోతుంది.
  • నిద్రలేమితో బాధపడుతున్న వారు రాత్రి ఆనపకాయను ఆహారంలో తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
  • మూత్రపిండాలను శుద్ది చేయడంలో ఆనపకాయకు పెట్టింది పేరు. ఇందులోని ఖనిజాలు మూత్ర పిండాలకు ఎంతో మేలు చేస్తాయి.
First Published:  8 April 2019 1:50 AM IST
Next Story