అంతా ఓకే.. పుకార్లు ఖండించిన చిరంజీవి
సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అయితే అంతలోనే చిరంజీవికి సంబంధించిన మరో సినిమా ఆగిపోయిందంటూ 2 రోజులుగా పుకార్లు మొదలయ్యాయి. అదే కొరటాల-చిరంజీవి సినిమా. వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయిందని, కథాచర్చలు నిలిచిపోయాయని పుకార్లు వచ్చాయి. వీటిని ఖండిస్తూ యూనిట్ ప్రకటన ఇచ్చింది. చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయిందనే విషయాన్ని నిర్థారించింది యూనిట్. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మార్కెట్లో చక్కర్లుకొడుతున్న వార్తల్లో నిజం లేదని […]

సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అయితే అంతలోనే చిరంజీవికి సంబంధించిన మరో సినిమా ఆగిపోయిందంటూ 2 రోజులుగా పుకార్లు మొదలయ్యాయి. అదే కొరటాల-చిరంజీవి సినిమా. వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయిందని, కథాచర్చలు నిలిచిపోయాయని పుకార్లు వచ్చాయి. వీటిని ఖండిస్తూ యూనిట్ ప్రకటన ఇచ్చింది.
చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయిందనే విషయాన్ని నిర్థారించింది యూనిట్. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మార్కెట్లో చక్కర్లుకొడుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. సైరా సినిమా కంప్లీట్ అయిన వెంటనే చిరంజీవి-కొరటాల కాంబో సెట్స్ పైకి వస్తుందని ప్రకటించారు.
కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఇందులో హీరోయిన్ గా అనుష్క లేదా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. నిజానికి చిరంజీవి-కొరటాల సినిమా స్థానంలో కొరటాల-రామ్ చరణ్ సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా ప్రకటన కూడా జరిగిపోయింది. ఇంతలోనే కొరటాల చెప్పిన ఓ కథ చిరంజీవికి బాగా నచ్చడం, వెంటనే చేయడానికి చిరు మొగ్గుచూపడంతో.. కొరటాల-చరణ్ కాంబినేషన్ ఇంకాస్త ఆలస్యమైంది.