Telugu Global
National

ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంటు తీస్తే.... వినియోగదారునికి పరిహారం

ఇప్పుడంటే 24 గంటల విద్యుత్‌కు అలవాటు పడిపోయాం. కొంత కాలం కిందట వర్షమొచ్చినా, ఎండ కాసినా కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిరంతరాయ విద్యుత్‌కు అలవాటు పడి అప్పుడప్పుడు కరెంటు పోయినా పెద్దగా పట్టించుకోవట్లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రైవేటు సంస్థలు గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ సంస్కరణలతో చార్జీలు భారీగా తగ్గాయి. ఇప్పుడు వినియోగదారునికి మరింత ఊరటనిచ్చే నిబంధనను […]

ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంటు తీస్తే.... వినియోగదారునికి పరిహారం
X

ఇప్పుడంటే 24 గంటల విద్యుత్‌కు అలవాటు పడిపోయాం. కొంత కాలం కిందట వర్షమొచ్చినా, ఎండ కాసినా కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిరంతరాయ విద్యుత్‌కు అలవాటు పడి అప్పుడప్పుడు కరెంటు పోయినా పెద్దగా పట్టించుకోవట్లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రైవేటు సంస్థలు గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ సంస్కరణలతో చార్జీలు భారీగా తగ్గాయి. ఇప్పుడు వినియోగదారునికి మరింత ఊరటనిచ్చే నిబంధనను తీసుకొని వచ్చింది అక్కడి ఆప్ ప్రభుత్వం.

చెప్పాపెట్టకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే సదరు విద్యుత్ సంస్థ వినియోగదారునికి పరిహారం చెల్లించాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. ఇది గరిష్టంగా 5 వేల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ మేరకు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సవరించిన నిబంధనలు ఇవాల్టి నుంచి అమలు లోకి వచ్చాయి.

మొదటి రెండు గంటల పాటు కరెంటు కోతకు గంటకు 50 చొప్పున…. ఆ తర్వాత గంటలకు 100 రూపాయల చొప్పున వినియోగదారునికి పరిహారం చెల్లించాలి. దేశంలో ఇలాంటి నిబంధన తీసుకొని రావడం ఇదే తొలిసారి. ఈ నిబంధనలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

First Published:  21 Dec 2018 10:41 AM IST
Next Story