పాతపుస్తకాలు సేకరించి పంపిణి...ఢిల్లీలో కొత్త ప్రయోగం!
అన్నలు అక్కలు చదివిన పుస్తకాలతోనే తరువాత సంవత్సరాల్లో తమ్ముళ్లు, చెల్లెళ్లు చదవటం ఇదివరకు రోజుల్లో ఎక్కువగా జరుగుతుండేది. ఇప్పుడు ఇళ్లలో ఒకరిద్దరు పిల్లలే అవుతుండటంతో ఆ పుస్తకాలను మళ్లీ మళ్లీ వినియోగించుకోలేకపోతున్నారు. అలా ఏటా పాఠ్యగ్రంథాలు వృధా అవుతున్నాయి. దీన్ని నివారించి… పుస్తకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసే పనిని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. దీనివలన తల్లిదండ్రులకు డబ్బు ఆదా కావడమే కాకుండా…కాగితం ఖర్చు తగ్గి చెట్లను రక్షించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. […]
అన్నలు అక్కలు చదివిన పుస్తకాలతోనే తరువాత సంవత్సరాల్లో తమ్ముళ్లు, చెల్లెళ్లు చదవటం ఇదివరకు రోజుల్లో ఎక్కువగా జరుగుతుండేది. ఇప్పుడు ఇళ్లలో ఒకరిద్దరు పిల్లలే అవుతుండటంతో ఆ పుస్తకాలను మళ్లీ మళ్లీ వినియోగించుకోలేకపోతున్నారు. అలా ఏటా పాఠ్యగ్రంథాలు వృధా అవుతున్నాయి. దీన్ని నివారించి… పుస్తకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసే పనిని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది.
దీనివలన తల్లిదండ్రులకు డబ్బు ఆదా కావడమే కాకుండా…కాగితం ఖర్చు తగ్గి చెట్లను రక్షించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో స్కూళ్లు తెరవగానే మొట్టమొదటిసారిగా 587 ప్రాథమిక స్కూళ్లకు ఇలా సేకరించిన పుస్తకాలను పంపిణీ చేశారు. గత ఏడాది పిల్లలకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాల్లో 80శాతం వరకు… మార్చిలో కలెక్ట్ చేశామని..వాటిలో 32 శాతం వరకు తిరిగి పిల్లలకు ఇవ్వటం జరిగిందని విద్యాశాఖ డైరక్టర్ ముఖేష్ యాదవ్ తెలిపారు. ఈ 32 శాతం పుస్తకాలను తిరిగి పంపిణీ చేయడంతోనే 1.02 కోట్ల రూపాయల ఖర్చు తప్పిందని ఆయన చెప్పారు.
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధమిక స్కూళ్లలో ఉన్న 2.97 లక్షలమంది విద్యార్థులకు అన్నితరగతులకు కలిపి 42 భిన్న పుస్తకాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ పుస్తకాలకు అయ్యే ఖర్చు 4.27 కోట్లు. అయితే ఈ పిల్లలందరికీ కనీసం ఒక పుస్తకం పాతది ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది వాడిన పుస్తకాలను మరింత ఎక్కువగా వినియోగంలోకి తేవాలనుకుంటున్నామని యాదవ్ అన్నారు. సేకరించిన పుస్తకాల్లో సరిగ్గా లేనివాటిని దాచి ఉంచామని, వాటిని తిరిగి బైండింగ్ చేయించి వచ్చే ఏడాది పంచుతామని ఆయన అన్నారు. సక్రమంగా అమల్లోకి తేగలిగితే నిజంగా ఎంతో వ్యయాన్ని నివారించగల మంచి పద్ధతి ఇది.
Click on Image to Read: