పగలు స్టూడెంట్లు....రాత్రులు సెల్ ఫోన్ దొంగలు!
ఇంట్లో ట్యూషన్‌కని చెప్పి పిల్లలు బయటకు వెళుతుంటే…ఏ తల్లిదండ్రులైనా నిజమనే అనుకుంటారు. ఆ ఇద్దరు విద్యార్థులు కూడా వాళ్ల అమ్మానాన్నలను అలాగే మోసం చేస్తూ వచ్చారు. ట్యూషన్‌కి వెళుతున్నామని చెప్పి రాత్రులు ఇంట్లోంచి బయటపడేవారు. కానీ వారు వెళ్లేది మాత్రం చదువుకోసం కాదు…సెల్ ఫోన్ల దొంగతనాలకోసం. చివరికి ఎంత పకడ్బందీగా దొంగతనాలు చేసినా పోలీసులకు దొరికిపోయారు. సచిన్, నసీరుద్దీన్ అనే ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు….ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఒక ప్రముఖ కాలేజిలో బిటెక్ ఫైనల్ ఇయర్ […]
ఇంట్లో ట్యూషన్‌కని చెప్పి పిల్లలు బయటకు వెళుతుంటే…ఏ తల్లిదండ్రులైనా నిజమనే అనుకుంటారు. ఆ ఇద్దరు విద్యార్థులు కూడా వాళ్ల అమ్మానాన్నలను అలాగే మోసం చేస్తూ వచ్చారు. ట్యూషన్‌కి వెళుతున్నామని చెప్పి రాత్రులు ఇంట్లోంచి బయటపడేవారు. కానీ వారు వెళ్లేది మాత్రం చదువుకోసం కాదు…సెల్ ఫోన్ల దొంగతనాలకోసం. చివరికి ఎంత పకడ్బందీగా దొంగతనాలు చేసినా పోలీసులకు దొరికిపోయారు. సచిన్, నసీరుద్దీన్ అనే ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు….ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఒక ప్రముఖ కాలేజిలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా మరొకరు సిఎ విద్యార్థి.
శనివారం రాత్రి పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు సెల్ఫోన్లను దొంగతనం చేయడమే కాకుండా, పట్టుపడకుండా తప్పించుకోవడానికి హాలివుడ్ సినిమాలనుండి నేర్చుకున్న ట్రిక్‌లను ప్రయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరికి వివేక్ అనే మరొక యువకుడు సహాయం చేస్తున్నాడు. ఇతను తన టూవీలర్మీద రోడ్డుమీద తిరుగుతూ…ఫోన్ల దొంగతనానికి వీలుగా ఉన్న ప్రదేశాలను వ్యక్తులను సెలక్ట్ చేస్తుంటాడు. అతను టార్గెట్ నిర్దేశించాక సచిన్ నసీరుద్దిన్లు రంగంలోకి దిగి దొంగతనాలు చేస్తారు.
తూర్పుఢిల్లీలోని వికాస్ మార్గ్ ప్రాంతంలో పోలీసులు ఒక చెక్ పాయింట్ వద్ద సచిన్, నసీరుద్దిన్‌లను ఆపినపుడు…వారు పారిపోవడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆ ఇద్దరి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వివేక్ పట్టబడకుండా తప్పించుకున్నాడు. పోలీసుల ఇంటరాగేషన్లో సచిన్, నసీరుద్దిన్ తమ దొంగతనాల వివరాలు బయటపెట్టారు. ఇంట్లో ట్యూషన్‌కని చెప్పి బయటపడతామని చెప్పారు. సెల్ఫోన్ల దొంగతనాలకోసం ఒక స్కూటర్ని కూడా దొంగిలించినట్టుగా తెలిపారు. దొంగతనం చేసిన ఫోన్ల ఫొటోలను అజ్ఞాత వాట్సప్ నెంబర్ ద్వారా అప్లోడ్ చేసి…మంచి రేటు ఇచ్చినవారికి అమ్ముతున్నామని ఆ ఇద్దరు దొంగలు వెల్లడించారు.