విభేదాల్లేవా... మరి జాప్యమెందుకు? వీటికి మీ వద్ద బదులుందా?
తెలంగాణ సీఎంతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనలో తానే నిర్ణయం తీసుకోవాలనడం సబబు కాదన్నారు. ఇది ఇద్దరు కూర్చుని మాట్లాడాల్సిన విషయం. హైకోర్టు విభజన కోసం.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో నాలుగుసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించా.. కానీ సాధ్యపడలేదు. ఇదంతా అనవసర రాద్దాంతం.. అన్నీ వదులుకున్నతమకు హైకోర్టును వదులుకోలేమా? అని ఎదురుప్రశ్నించారు. నాకు నోరులేదా? గొడవలు పడితే ఉపయోగం లేదు అని హెచ్చరించారు. వీటికి ఏం సమాధానం ఇస్తారు బాబు? 1. […]
BY sarvi2 July 2016 4:51 AM IST

X
sarvi Updated On: 2 July 2016 6:03 AM IST
తెలంగాణ సీఎంతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనలో తానే నిర్ణయం తీసుకోవాలనడం సబబు కాదన్నారు. ఇది ఇద్దరు కూర్చుని మాట్లాడాల్సిన విషయం. హైకోర్టు విభజన కోసం.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో నాలుగుసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించా.. కానీ సాధ్యపడలేదు. ఇదంతా అనవసర రాద్దాంతం.. అన్నీ వదులుకున్నతమకు హైకోర్టును వదులుకోలేమా? అని ఎదురుప్రశ్నించారు. నాకు నోరులేదా? గొడవలు పడితే ఉపయోగం లేదు అని హెచ్చరించారు.
వీటికి ఏం సమాధానం ఇస్తారు బాబు?
1. చంద్రబాబు మాటలతో ఇప్పట్లో హైకోర్టు విభజనకు ఆయన సుముఖత తెలిపేలా లేరన్న విషయం స్పష్టమైందని తెలంగాణవాదులు, గులాబీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. గొడవలు పడితే..ప్రయోజనం లేదు అన్న మాటల్లో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
2. అంటే.. ఈ విషయంలో మరింత జాప్యం చేయదలుచుకున్నారన్న సంకేతాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
3. అన్నీ వదులుకున్న మీకు హైకోర్టు వదులుకోవడంలో ఇబ్బంది ఏంటి? అని నిలదీస్తున్నారు.
4. హైకోర్టు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఏపీ సీఎం చంద్రబాబే అని మీడియా ముందు కుండ బద్దలు కొట్టిన కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రశ్నకు సమాధానం చంద్రబాబు వద్ద లేదని తెలంగాణ న్యాయాధికారులు మండిపడుతున్నారు.
5. తెలంగాణ న్యాయాధికారుల నోట్లో మట్టి కొట్టేందుకు ఆయన మౌనంగా ఉంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
6. తెలంగాణ సీఎం హైకోర్టు నిర్మించేందుకు చూపించిన ప్రత్యామ్నాయాలు ఏపీ సీఎంకు ఎందుకు నచ్చడం లేదు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
7. స్థలం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నా ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నారు. పోనీ.. ఇప్పుడున్న కోర్టును మీరే ఉంచుకోండి.. మేము వేరే చోటకు వెళతామన్న సీఎం కేసీర్ ప్రతిపాదననైనా ఎందుకు అంగీకరించడం లేదు?
Next Story