Telugu Global
Cinema & Entertainment

చరణ్, చిరంజీవి నువ్వానేనా అన్నట్టు దూసుకుపోతున్నారు

మెగా స్టార్ చిరంజీవి, మెగా తనయుడు రామ్ చరణ్ తేజ…. ఇద్దరూ ఇప్పుడు ఒకే ట్రాక్ మీదున్నారు. ఇద్దరూ తమ తాజా సినిమాల కోసం తయారవుతున్నారు. గమ్మత్తుగా… ఇద్దరూ తమిళ రీమేకులతో రెడీ అవుతున్నారు. మరో విశేషమేంటంటే..  తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఒకే డాన్స్ ఫ్లోర్ పై డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకేసారి మేకోవర్ కూడా అవుతున్నారు. అవును… చిరంజీవి ఇంట్లోనే పెద్ద జిమ్ ఉంది. అదే జిమ్ లో చెర్రీ, […]

చరణ్, చిరంజీవి నువ్వానేనా అన్నట్టు దూసుకుపోతున్నారు
X
మెగా స్టార్ చిరంజీవి, మెగా తనయుడు రామ్ చరణ్ తేజ…. ఇద్దరూ ఇప్పుడు ఒకే ట్రాక్ మీదున్నారు. ఇద్దరూ తమ తాజా సినిమాల కోసం తయారవుతున్నారు. గమ్మత్తుగా… ఇద్దరూ తమిళ రీమేకులతో రెడీ అవుతున్నారు. మరో విశేషమేంటంటే.. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఒకే డాన్స్ ఫ్లోర్ పై డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకేసారి మేకోవర్ కూడా అవుతున్నారు. అవును… చిరంజీవి ఇంట్లోనే పెద్ద జిమ్ ఉంది. అదే జిమ్ లో చెర్రీ, చిరు కలిసి ఎక్సర్ సైజులు చేస్తున్నారట. అంతేకాదు… చిరు చేస్తున్న జుంబా డాన్స్ ను చెర్రీ కూడా చేస్తున్నాడట. ఇక మేకోవర్ విషయానికొస్తే… సురేందర్ రెడ్డి తో చేయబోతున్న కొత్త సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రైచేస్తున్నాడట చెర్రీ. అటు చిరంజీవి కూడా తన 150వ సినిమాకు న్యూలుక్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తానికి తండ్రీకొడుకులిద్దరూ అన్ని అంశాల్లో నువ్వానేనా అన్నట్టు దూసుకుపోతున్నారు.
Click on Image to Read:
ramcharan-upasana
pawan
ram-charan-chiru-birthday
allu-arjun
First Published:  7 March 2016 4:11 AM IST
Next Story