లోక్‌సభలో "తెలంగాణ ప్రత్యేక హోదా" బిల్లు
ప్రత్యేక హోదా కావాలంటూ 18 నెలలుగా ఏపీప్రజలు గగ్గోలుపెడుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కేంద్రం వైఖరి చూసిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో మోసపోయామని ఇప్పటికే ఏపీ జనం ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా తమ రాష్ఠ్రానికి ప్రత్యేక హోదా కావాలంటోంది. అడగడమే కాదు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ ఈ మేరకు లోక్‌సభలో శుక్రవారం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. ”స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ – 2015” […]
ప్రత్యేక హోదా కావాలంటూ 18 నెలలుగా ఏపీప్రజలు గగ్గోలుపెడుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదు. కేంద్రం వైఖరి చూసిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో మోసపోయామని ఇప్పటికే ఏపీ జనం ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా తమ రాష్ఠ్రానికి ప్రత్యేక హోదా కావాలంటోంది. అడగడమే కాదు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ ఈ మేరకు లోక్‌సభలో శుక్రవారం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. ”స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ – 2015” పేరుతో ప్రైవేట్ బిల్లును మూవ్ చేశారు.
”ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మౌలిక సదుపాయాల రూపకల్పన, అభివృద్దిలో వెనుకుబాటుకు గురైంది. కరువు తాండవిస్తోంది. నీటి, విద్యుత్ కొరత కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సవాళ్లు అధిగమించేందుకు కేంద్రం పలు విధాలుగా సాయం అందించాలి” అని బిల్లులో వివరించారు. ”రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకహోదా అవసరం” అని బిల్లులో కోరారు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కూడా ఇవ్వాలని విన్నవించారు.
Click to Read: Govt agency lands Modi in trouble
ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగి, ఆ తర్వాత ఓటింగ్ ద్వారా ఆమోదం పొందితే గెజిట్‌లో ప్రచురిస్తారు. కానీ ప్రైవేట్ బిల్లు కాబట్టి అంత దూరం వెళ్లే అవకాశాలు లేవనే చెప్పాలి. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినట్టు ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమన్నారు.