దేశంలో దాడులకు పాక్ పన్నాగం: ఐబి హెచ్చరిక
పాక్ నుంచి సరిహద్దులు దాటిన 20 మంది ఉగ్రవాదులు ఢిల్లీలో మకాం వేసినట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. వీరు దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. ఉగ్రవాదులు ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, పండుగ సమయాల్లో వీరు రెచ్చిపోయే అవకాశం ఉందని వారన్నారు. ఎరినైనా అనుమానితులుగా భావిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఈ ఉగ్రవాదులకు ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్‌ఐ) శిక్షణ ఇచ్చి పంపిందని, వీరి వద్ద అత్యంతాధునిక ఆయుధాలు […]
పాక్ నుంచి సరిహద్దులు దాటిన 20 మంది ఉగ్రవాదులు ఢిల్లీలో మకాం వేసినట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. వీరు దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. ఉగ్రవాదులు ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, పండుగ సమయాల్లో వీరు రెచ్చిపోయే అవకాశం ఉందని వారన్నారు. ఎరినైనా అనుమానితులుగా భావిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఈ ఉగ్రవాదులకు ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్‌ఐ) శిక్షణ ఇచ్చి పంపిందని, వీరి వద్ద అత్యంతాధునిక ఆయుధాలు ఉన్నట్టు సమాచారం అందిందని ఐబి పేర్కొంది. భారత్‌లో దాడులకు ఉగ్రమూకలు మరోసారి సిద్ధమయ్యాయి. పంజాబ్, జమ్ము కశ్మీర్, ఢిల్లీసహా వివిధ ప్రాంతాల్లో పేలుళ్లతో అలజడి సృష్టికి పాక్ ఐఎస్‌ఐ పన్నిన పన్నాగాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిదీన్, సిక్కు మిలిటెంట్లు, బాబర్ ఖల్సా ఇంటర్‌నేషనల్(బీకేఐ), ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్(కేజెడ్‌ఎఫ్)లను ఐఎస్‌ఐ.. భారత్‌లోకి ఇప్పటికే తరలించినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.