స్పందించకుంటే ప్రభుత్వ బడుల్లో అధికారుల పిల్లలు: హైకోర్టు
500 మంది విద్యార్థులకు ఒక్క టీచరుంటే ఆ స్కూల్లో మీ పిల్లలను చేర్పిస్తారా అంటూ హైకోర్టు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. ఉపాధ్యాయుల కొరతపై అధికారులు స్పందించకుంటే కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బొసలే, జస్టిస్ ఎస్ వి. భట్ లతో కూడిన ధర్మాసనం అధికారులను హెచ్చరించింది. టీచర్ల నియామకంపై గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేయడంపై కూడా […]
BY sarvi20 Aug 2015 6:46 PM IST
sarvi Updated On: 21 Aug 2015 8:32 AM IST
500 మంది విద్యార్థులకు ఒక్క టీచరుంటే ఆ స్కూల్లో మీ పిల్లలను చేర్పిస్తారా అంటూ హైకోర్టు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. ఉపాధ్యాయుల కొరతపై అధికారులు స్పందించకుంటే కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బొసలే, జస్టిస్ ఎస్ వి. భట్ లతో కూడిన ధర్మాసనం అధికారులను హెచ్చరించింది. టీచర్ల నియామకంపై గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేయడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు తీరు మార్చుకోకుంటే, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలనే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, టీచర్ల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. తమ స్కూళ్లలో టీచర్లను నియమించాల్సిందిగా అధికారులను ఆదేశించమని కోరుతూ మహబూబ్‌నగర్‌కు చెందిన 1700 మంది విద్యార్ధులు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story