Telugu Global
Others

ప్ర‌ధానితో బాబు భేటీ ఎందుకు వాయిదాప‌డిందంటే..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడితో తెలుగుదేశం అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భేటీ అక‌స్మాత్తుగా వాయిదా ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ప్ర‌త్యేక హోదాపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు, యాగీకి తాళం వేసేలా ప్ర‌ధాన‌మంత్రి నుంచి కొన్ని స్ప‌ష్ట‌మైన హామీల‌ను రాబ‌ట్టాల‌ని చంద్ర‌బాబు భావించారు. 20న భేటీకి ప్ర‌ధాన‌మంత్రి కూడా ఓకే అన్నారు. కానీ ఒక‌రోజు ముందు ఆ భేటీ ర‌ద్ద‌యింది. ఈనెలాఖ‌రులో కొన్ని తేదీల‌ను సూచించి వాటిలో ఒక తేదీని ఎంపిక చేసుకోవ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం […]

ప్ర‌ధానితో బాబు భేటీ ఎందుకు వాయిదాప‌డిందంటే..
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడితో తెలుగుదేశం అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భేటీ అక‌స్మాత్తుగా వాయిదా ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌త్యేక హోదాపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు, యాగీకి తాళం వేసేలా ప్ర‌ధాన‌మంత్రి నుంచి కొన్ని స్ప‌ష్ట‌మైన హామీల‌ను రాబ‌ట్టాల‌ని చంద్ర‌బాబు భావించారు. 20న భేటీకి ప్ర‌ధాన‌మంత్రి కూడా ఓకే అన్నారు. కానీ ఒక‌రోజు ముందు ఆ భేటీ ర‌ద్ద‌యింది. ఈనెలాఖ‌రులో కొన్ని తేదీల‌ను సూచించి వాటిలో ఒక తేదీని ఎంపిక చేసుకోవ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి చంద్ర‌బాబు నాయుడుకు వ‌ర్త‌మానం అందింది. ఊహించ‌ని ఈ ప‌రిణామానికి తెలుగుదేశం అధినేత‌తో పాటు పార్టీ నాయ‌క‌త్వ‌మంతా బిత్త‌ర‌పోయింది. ప్ర‌ధానితో మాట్లాడాల్సిన విష‌యాల‌పై స‌రంజామా అంతా స‌ర్దుకున్న త‌ర్వాత ఈ ఝ‌ల‌క్ ఏమిటో వారికి అర్ధం కాలేదు. బాబు భేటీ వాయిదా ప‌డ‌డానికి బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నాయ‌క‌త్వ‌మే కార‌ణ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. గ‌త కొద్ది కాలంగా రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ మ‌ధ్య పొత్తు అంత‌గా పొస‌గ‌డం లేదు. త‌మ‌కు త‌గినంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని బీజేపీ నాయ‌కులు వాపోతున్నారు. అంతేకాదు ఆ విష‌యాన్ని మీడియా ముందే బ‌హిరంగంగా చెబుతున్నారు కూడా. క్షేత్ర స్థాయిలో త‌మ‌ను విస్మ‌రించి కించ‌ప‌రుస్తున్నార‌న్న బాధ బీజేపీ నాయ‌కుల‌లో ఉంది. ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన‌మంత్రితో స‌మావేశ‌మై ఏవో కొన్ని హామీలు రాబ‌ట్టి ఆ విష‌యాన్ని మీడియాకు చెబితే త‌మ‌కొచ్చే లాభ‌మేమిట‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం ఆలోచించింది.. ప్ర‌ధానితో బాబు భేటీ స‌మ‌యంలో తాము కూడా ఉంటే త‌మ‌కు కూడా కొంత మైలేజీ వ‌స్తుంద‌ని, రాష్ట్రంలో పార్టీ వికాసానికి అది ఉప‌క‌రిస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు అధిష్టానానికి నివేదించార‌ని స‌మాచారం. అందులోని లాజిక్‌ను అర్ధం చేసుకున్న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం అందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని, అందుకే బాబు భేటీని వాయిదా వేయించార‌ని వినిపిస్తోంది. త‌మ ప్రాధాన్య‌త‌ను చంద్ర‌బాబు, తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేలా చేయ‌డంతో పాటు ప్ర‌ధానితో భేటీ వ‌ల్ల వ‌చ్చే ప్రచార ప్ర‌యోజ‌నాల‌ను త‌మ పార్టీకి కూడా ల‌భించేలా చూడ‌డం బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అంటే ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌మాట‌. త‌మ‌ను ల‌క్ష్య‌పెట్ట‌ని తెలుగుదేశం నాయ‌కుల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం కీల‌క‌మైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అర్ధం కావ‌డం లేదూ..
First Published:  20 Aug 2015 2:13 AM IST
Next Story