ప్రభుత్వానికి కేక పుట్టించిన పారిశుద్ధ్య కార్మికులు
దిక్కుమాలిన సమ్మెలంటూ ముఖ్యమంత్రి చేసిన ఈసడింపు వ్యాఖ్యలు పారిశుద్ధ్య కార్మికుల్లో పట్టుదల పెంచాయి. కార్మికులు సంఘటితమై సమిష్టిగా నిలబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించేందుకు రామదండు మాదిరిగా నగరానికి బయలుదేరింది. తెలంగాణలోని పది జిల్లాల్లోని గ్రామ పంచాయతీ, కార్మిక సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌కు చేరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా ధర్నాచౌక్‌కు చేరిన కార్మికులు తమ నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లిలే చేశారు.. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ […]
BY admin13 Aug 2015 10:00 AM IST
X
admin Updated On: 13 Aug 2015 10:00 AM IST
దిక్కుమాలిన సమ్మెలంటూ ముఖ్యమంత్రి చేసిన ఈసడింపు వ్యాఖ్యలు పారిశుద్ధ్య కార్మికుల్లో పట్టుదల పెంచాయి. కార్మికులు సంఘటితమై సమిష్టిగా నిలబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించేందుకు రామదండు మాదిరిగా నగరానికి బయలుదేరింది. తెలంగాణలోని పది జిల్లాల్లోని గ్రామ పంచాయతీ, కార్మిక సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌కు చేరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా ధర్నాచౌక్‌కు చేరిన కార్మికులు తమ నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లిలే చేశారు.. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 1 నుంచి తాము చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరిందని, అయినా ప్రభుత్వం స్పందించలేదని కార్మికులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావులు కార్మికుల సమస్య పట్ల ప్రదర్శించిన ఈసడింపు వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. కార్మికుల ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో సహా వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. కార్మికుల వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేసారు.
Next Story