Telugu Global
Telangana

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా.. సిగరెట్ ప్యాకెట్లలో గుట్టుగా సరఫరా

ఏపీలో పట్టుబడిన డ్రగ్స్ విదేశాలనుంచి ఇక్కడకు రవాణా కాగా, తెలంగాణలో పట్టుకున్న డ్రగ్స్ ఇక్కడినుంచి విదేశాలకు సరఫరా అవుతున్నాయి.

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా.. సిగరెట్ ప్యాకెట్లలో గుట్టుగా సరఫరా
X

ఇటు ఏపీలో 25 వేల కిలోల డ్రగ్స్ ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం కాగా, అటు తెలంగాణలో కూడా భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివారులోని బొల్లారంలో 90కేజీల డ్రగ్స్ ని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఈ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవల ఇదే మొదలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంతో పనిచేస్తామని నేతలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భారీగా డ్రగ్స్ ని పట్టుకుంటున్నారు అధికారులు. డ్రగ్స్ సరఫరా ముఠాల ఆట కట్టిస్తున్నారు.

సిగరెట్ ప్యాకెట్లలో సరఫరా..

బొల్లారంలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న సమాచారంలో పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు అధికారులు. అక్కడ నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 10 సంవత్సరాలుగా ఇక్కడ ఈ దందా జరుగుతున్నట్టు గుర్తించారు. సిగరెట్‌ ప్యాకెట్లలో వీటిని పెట్టి బయటకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. సిగరెట్ ప్యాకెట్లలో ఉంటే ఎవరికీ అనుమానం రాదనే వ్యూహంతో డ్రగ్స్ బ్యాచ్ ఈ ప్లాన్ వేసింది. పెద్ద మొత్తంలో సిగరెట్ ప్యాకెట్లను, డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

అక్కడ ఇంపోర్ట్.. ఇక్కడ ఎక్స్ పోర్ట్..

ఏపీలో పట్టుబడిన డ్రగ్స్ విదేశాలనుంచి ఇక్కడకు రవాణా కాగా, తెలంగాణలో పట్టుకున్న డ్రగ్స్ ఇక్కడినుంచి విదేశాలకు సరఫరా అవుతున్నాయి. పదేళ్ల నుంచి వీటిని తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. కస్తూరిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నగరంలో కూడా పలు ప్రాంతాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

First Published:  22 March 2024 7:14 AM GMT
Next Story