Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వం మరో యూటర్న్‌

రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం తీరు గందరగోళానికి దారి తీస్తోంది. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ దగ్గరున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన లేదు.

తెలంగాణ ప్రభుత్వం మరో యూటర్న్‌
X

తెలంగాణ ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. రైతు రుణమాఫీ విషయంలోనూ చేతులెత్తేసింది. రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే. కానీ, వంద రోజుల్లో అని ఎక్కడా చెప్పలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కానీ, ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్‌ రెడ్డే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9న రూ. 2 లక్షల వరకు ఒకేసారి పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులంతా వెంటనే బ్యాంకుల దగ్గరికి వెళ్లి అప్పులు తెచ్చుకోమని వారిని ఆశపెట్టారు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించింది. అయితే ఎప్పటిలాగే తనదైన స్టయిల్‌లో కవర్‌ చేశారు భట్టి.

రైతుభరోసాపై తప్పుడు లెక్కలు..!

రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం తీరు గందరగోళానికి దారి తీస్తోంది. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ దగ్గరున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన లేదు. మంత్రి చెప్పింది నిజమైతే ఆరెకరాలున్న రైతులకు కూడా ఈపాటికి డబ్బులు జమ అయ్యేవి. కానీ ఐదెకరాలున్నా తమకే డబ్బులు పడలేదని రైతులు చెప్తున్నారు. వ్యవసాయశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 61 లక్షలమంది రైతులకు మాత్రమే రైతుభరోసా సాయం అందింది. మంత్రి చెప్తున్న గణాంకాలకు, వాస్తవ లెక్కలకు మధ్య భారీ తేడా ఉండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  20 April 2024 4:12 AM GMT
Next Story