ఆడవాళ్లు తప్పక తీసుకోవాల్సిన జింక్ రిచ్ ఫుడ్స్!

జింక్ ముఖ్యం
ఆడవారి ఆరోగ్యంలో జింక్ కీలకపాత్ర పోషిస్తుంది. మహిళల్లో ఇమ్యూనిటీ పెరుగుదలకు, హార్మోన్స్ బ్యాలెన్స్, ఎముకల ఆరోగ్యం కోసం జింక్ తీసుకోవడం అత్యంత అవసరం. జింక్ మినరల్ ఏయే ఫుడ్స్‌లో ఎక్కువగా లభిస్తుందంటే.
నట్స్
బాదం పప్పు, జీడి పప్పు, గుమ్మడి గింజల్లో జింక్ మినరల్ ఎక్కువగా లభిస్తుంది. వీటిలో జింక్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్, ప్రొటీన్స్ కూడా లభిస్తాయి. వీటిని శ్నాక్స్ రూపంలో రోజూ తీసుకుంటే మంచిది.
డెయిరీ ఫుడ్స్
పాలు, పెరుగు వంటి పదార్ధాల్లో కూడా జింక్ పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ఉండే క్యాల్షియం వల్ల మహిళల్లో కీళ్ల బలహీనత కూడా రాకుండా ఉంటుంది.
మిల్లెట్స్
మిల్లెట్స్‌లో రిచ్ డైటరీ ఫైబర్‌‌తో పాటు జింక్ కూడా ఉంటుంది. వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా రోజుకి సరిపడా జింక్ లభించడంతోపాటు మహిళల్లో ఒబెసిటీ తలెత్తకుండా ఉంటుంది.
గుడ్లు
గుడ్డు తినడం ద్వారా కూడా జింక్ మినరల్ లభిస్తుంది. జింక్‌తో పాటు రోజువారీ అవసరాలకు కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు ద్వారా లభిస్తాయి. కాబట్టి రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది.
పప్పులు
కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, బీన్స్ వంటి పప్పుల్లో కూడా జింక్ మినరల్ ఉంటుంది. అయితే వీటిని రోజూ తినడం కంటే వారానికి రెండు మూడు సార్లు తినడం మంచిది.
ఇది ఉంటేనే..
శరీరం జింక్‌ను అబ్జార్బ్ చేసుకోవడం కోసం విటమిన్–డి కావాలి. కాబట్టి జింక్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు విటమిన్–డి కూడా అందేలా చూసుకోవడం ఎంతైనా అవసరం.