సన్‌స్క్రీన్ లోషన్ ఎలా వాడాలో తెలుసా?

సమ్మర్‌‌లో తప్పనిసరి
సమ్మర్‌లో స్కిన్ పాడవ్వకూడదంటే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అయితే దీన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌పీఎఫ్ ఇలా..
సన్ స్క్రీన్ ఎంచుకునేటప్పుడు ఎస్‌పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్‌ను తీసుకోవాలి. ఎస్‌పీఎఫ్ 30 ఉండే లోషన్ సూర్యుని యూవీ కిరణాల నంచి 97 శాతం వరకు రక్షణ కల్పిస్తుంది.
ఇలా వాడాలి
సన్‌స్క్రీన్‌ను ఎండకు బయటకు వెళ్లే ప్రతీసారి రాసుకోవడం మంచిది. కేవలం ముఖానికే కాకుండా ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే చేతులు, కాళ్లు, మెడ భాగాలపై కూడా అప్లై చేసుకోవాలి.
రీ అప్లై
సన్‌స్క్రీన్ వెంటనే ఎండకు ఆవిరైపోతుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకోసారి లైట్‌గా అప్లై చేసుకుంటే మంచిది. చెమట పట్టినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ రాసుకోవాలి.
జాగ్రత్తలు ముఖ్యం
కళ్లు, పెదవుల దగ్గర సన్ స్క్రీన్‌ను రాసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఇంటికొచ్చిన వెంటనే చల్లని నీటితో ఫేస్‌వాష్ చేసుకోవాలి.
ట్యాన్ అవ్వకుండా
సమ్మర్‌‌లో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ద్వారా చర్మం ట్యాన్ అవ్వకుండా, యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూసుకోవచ్చు.
క్యాన్సర్ రాకుండా
సన్‌స్క్రీన్ లోషన్‌లో ఉండే కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి పదార్థాలు చర్మాన్ని పాడవ్వకుండా కాపాడతాయి. చర్మ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను తగ్గిస్తాయి.