సమ్మర్‌‌లో బార్లీ నీళ్లు ఎందుకు తాగాలంటే

సూపర్ డ్రింక్
బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవడం, శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా సమ్మర్‌‌లో రోజూ బార్లీ నీళ్లు తాగడం ద్వారా వేసవి తాపం నుంచి ఈజీగా బయటపడొచ్చు.
వేడి చేయకుండా
సమ్మర్‌‌లో బార్లీ నీళ్లు తాగితే వేడి చేయకుండా ఉంటుంది. శరీరం చల్లబడుతుంది. సమ్మర్‌‌లో వడదెబ్బ తగలకుండా ఈ డ్రింక్ నివారిస్తుంది.
ఎలక్ట్రోలైట్స్
బార్లీ నీళ్లు తాగడం ద్వారా క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, కాపర్ వంటి మినరల్స్ అందడంతోపాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి.
ఈజీ డైజెషన్
బార్లీ నీళ్లు తాగడం వల్ల పొట్ట క్లీన్ అవుతుంది. సమ్మర్‌‌లో వచ్చే అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కడుపులో ఎసిడిటీ, గ్యాస్‌ వంటివి రాకుండా చూసుకోవచ్చు.
డయాబెటిస్ ఫ్రీ
బార్లీలో డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తాగితే బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
కిడ్నీలు ఫ్రీ
ప్రతిరోజూ ఒక గ్లాస్‌ బార్లీ నీళ్లు తాగితే.. యూరిన్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యకు కూడా బార్లీ నీళ్లతో చెక్‌ పెట్టొచ్చు.
ఇలా చేయాలి
లీటర్‌ నీటిలో గుప్పెడు బార్లీ గింజలు వేసి 20 నిమిషాలపాటు నీటిని మరిగించాలి. తర్వాత గింజలను వడగట్టి నీటిలో నిమ్మరసం, తేనె లేదా ఉప్పు వేసుకుని తాగొచ్చు.