సమ్మర్ టూర్ కోసం బెస్ట్‌ ఫ్యామిలీ స్పాట్స్!

వేసవి సెలవుల్లో..
సమ్మర్ సెలవుల్లో ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. ఫ్యామిలీ ట్రిప్ అంటే అన్ని రకాల వసతులు ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి. అలాంటి కొన్ని బెస్ట్ ఫ్యామిలీ స్పాట్స్ ఇవీ..
నైనిటాల్
హాట్ సమ్మర్‌‌లో చల్లని హిల్ స్టేషన్‌కు వెళ్లాలనుకుంటే నైనిటాల్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్‌కు అనువుగా అన్నిరకాల వసతులు, హోటళ్లు అందుబాటులో ఉంటాయి.
సిక్కిం
హిమాలయాల్లో సమ్మర్ హాలిడేను ఎంజాయ్ చేయాలనుకుంటే సిక్కిం టూర్ వెళ్లాల్సిందే. అందమైన పర్వతాలు, శుభ్రమైన వీధులు, మంచి హోటళ్లు.. ఓవరాల్‌గా సిక్కిం.. ఫ్యామిలీ టూర్‌‌కు బెస్ట్ ఛాయిస్.
షిమ్లా
సమ్మర్‌‌లో వెళ్లదగిన మరో బెస్ట్ హిల్‌స్టేషన్ షిమ్లా. క్వీన్ ఆఫ్ హిమాలయాస్‌గా చెప్పుకునే ఈ సిటీ ఫ్యామిలీ ట్రిప్స్‌కు బాగుంటుంది. అందమైన లొకేషన్లతో పాటు ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్, వసతి సౌకర్యాలు కూడా బాగుంటాయి.
డార్జిలింగ్
దూరంగా హిమాలయాలను చూస్తూ అందమైన పచ్చని టీ తోటల మధ్య ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకుంటే డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేయాల్సిందే. ఇక్కడ టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి.
కొడైకెనాల్
సౌత్ ఇండియాలోనే బెస్ట్ హిల్ స్టేషన్‌గా చెప్పుకునే కొడైకెనాల్ సమ్మర్‌‌లో వెళ్లదగిన టూర్. ఇక్కడ ఫ్యామిలీతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల వసతులతోపాటు అడ్వెంచర్, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి.
రిషికేష్
సమ్మర్ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్ర చేయాలనుకునేవాళ్లు రిషికేష్, హరిద్వార్ ప్రాంతాలకు వెళ్లడం బెటర్. ఇక్కడ ఫ్యామిలీకి అనువుగా ఉండే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి.