థైరాయిడ్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవీ!

ముఖ్యమైన గ్రంథి
శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి చేసే ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్. అయితే రకరకాల కారణాల వల్ల మనదేశంలో సుమారు 40 లక్షల మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పాలకూర
విటమిన్ ‘ఎ’, ‘సి’, ఐరన్ వంటి న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉండే పాలకూరను తరచూ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.
పెరుగు
మంచి బ్యాక్టీరియా అధికంగా ఉండే పెరుగు రోజూ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడడంతోపాటు జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
బెర్రీస్
విటమిన్స్, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండే స్ట్రాబెరీ, బ్లూబెరీ, రాస్ప్ బెర్రీ వంటి పండ్లు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.
కొబ్బరి నూనె
‘మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్’ అధికంగా ఉండే కొబ్బరి నూనె థైరాయిడ్ ఫంక్షన్‌ను మెరుగుపరచడమే కాకుండా మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తుంది.
పసుపు
‘సర్కుమిన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండే పసుపుని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి థైరాయిడ్ డిజార్డర్స్ నుంచి కోలుకునేలా చేస్తుంది.
బ్రెజిల్ నట్స్
సెలెనియం అధికంగా ఉండే బ్రెజిల్ నట్స్ తినడం ద్వారా థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా మారుతుంది. సెలెనెయం మినరల్ థైరాయిడ్ హార్మోన్ పెరుగుదలకు తోడ్పడే మినరల్.