Telugu Global
Cinema & Entertainment

Mirai | తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్

Mirai Movie - తేజ సజ్జా కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. సినిమా పేరు మిరాయ్. జానర్ ఏంటో చూద్దాం..

Mirai | తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్
X

సూపర్ హీరో తేజ సజ్జ కొత్త సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు.

రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు ఈ గ్లింప్స్ ను లాంఛ్ చేశారు. 2025 ఏప్రిల్ 18న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. త్రీడీలో కూడా రాబోతోంది మిరాయ్. ఇందులో సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు.

ఈ చిత్రానికి ఫ్యూచర్ అనే అర్థం వచ్చేలా “మిరాయ్” అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో జపనీస్ ఫాంట్ లో రూపొందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్ లో చేతిలో యో (స్టాఫ్ స్టిక్)తో, బద్దలయ్యే అగ్నిపర్వతం పైన ఉగ్రంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో, మనం గ్రహణాన్ని గమనించవచ్చు.

ఈ గ్లింప్స్ ద్వారా సినిమా నేపథ్యాన్ని కూడా చెప్పారు. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పుడుతుంది.

ఇలా మూవీ నేపథ్యాన్ని వెల్లడించారు. సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తోంది. గౌర హరి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న మిరాయ్ సినిమాను 2డీ, 3డీలో విడుదల చేయబోతున్నారు.

First Published:  18 April 2024 5:18 PM GMT
Next Story